చైనాతో సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్న నేపథ్యంలో భారత వాయుసేన సారథి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా.. ఈఏసీ(ఈస్టర్న్ ఎయిర్ కమాండ్)లోని వైమానిక స్థావరాన్ని సందర్శించారు. యుద్ధసన్నద్ధతపై సమీక్షించారు.
బుధవారం జరిగిన ఈ పర్యటనలో భాగంగా వాయుసేన పైలట్లను కలిసి వారితో పలు కీలక విషయాలపై భదౌరియా మాట్లాడారు. అనంతరం ఎయిర్‌బేస్‌లోని సిబ్బందితో ముచ్చటించారు వైమానిక దళాధిపతి. ఎలాంటి ఆటంకం కలగకుండా ఎయిర్‌బేస్‌లో కార్యకలాపాలు సాగించేందుకు వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణను అత్యంత శ్రద్ధతో కొనసాగించాలన్నారు.
ఇదీ చూడండి:-పబ్జీ సహా 118 చైనా యాప్స్‌పై నిషేధం
మరోవైపు.. భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే తన రెండు రోజుల సరిహద్దు పర్యటనలో భాగంగా.. గురువారం లద్దాఖ్‌లో సమీక్ష నిర్వహించారు.