అమెరికా హవాయ్‌లోని పెరల్ హార్బర్లో కాల్పులు జరిగిన సమయంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, ఆయన బృందంతో పాటు అక్కడే ఉన్నారని భారత వైమానిక దళం తెలిపింది. అయితే.. వారికి ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.
అమెరికా కాల్పుల ఘటనలో భారత వాయుసేన సారథి సురక్షితం
అమెరికా నౌకాశ్రయం వద్ద కాల్పులు జరిగిన సమయంలో భారత వాయుసేన సారథి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సహా భారత బృందం ఘటనా స్థలంలోనే ఉంది. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం తెలిపింది.
అమెరికా కాల్పుల ఘటనలో భారత వాయు సారథి సురక్షితం
హవాయ్‌లోని పెరల్ హార్బర్ నౌకాశ్రయం వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. నావిక భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. పరస్పర కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా.. ముష్కరుడు తనకు తానే తలపై కాల్చుకుని చనిపోయాడు.
ఇదీ చదవండి:కర్ణాటకలో నేడు ఉపఎన్నికలు.. భాజపా సర్కారుకు కీలకం
TAGGED:
IAF Chief at american firing