తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత శాస్త్రవేత్తల బృందానికి కరోనా - సీ-17 గ్లోబ్ మాస్టర్ హెవీలిఫ్ట్ ట్రాన్స్​పోర్ట్ విమానం సిద్ధం చేసిన వైమానిక దళం

పరిశోధనల నిమిత్తం ఓ మధ్య ఆసియా దేశానికి వెళ్లిన 50 మంది భారత శాస్త్రవేత్తలకు కరోనా సోకింది. ఈ తరుణంలో భారత వైమానిక దళం 19 గంటలపాటు సహాయక మిషన్ నిర్వహించింది. అందరినీ ఓ విమానంలో భారత్​కు తీసుకువచ్చింది.

scientists
భారత శాస్త్రవేత్తల బృందానికి కరోనా

By

Published : Nov 30, 2020, 7:12 AM IST

50 మంది భారతీయ శాస్త్రవేత్తలు.. పరిశోధనల నిమిత్తం మధ్య ఆసియాలోని ఓ దేశానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు వారిలో కొందరు కరోనా బారిన పడ్డారు. అక్కడేమో సరైన చికిత్స అందే మార్గం కనిపించలేదు. అక్కడి భారత దౌత్య కార్యాలయ అధికారులు భారత వైమానిక దళాన్ని సంప్రదించి శాస్త్రవేత్తలను స్వదేశానికి తీసుకురావడానికి సహాయాన్ని కోరారు. భారత వైమానిక దళం తక్షణం రంగంలోకి దిగింది. 19 గంటల పాటు సహాయక మిషన్ నిర్వహించి ఓ ప్రత్యేక విమానం ద్వారా ఆ శాస్త్రవేత్తలను భారత్​కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ నెల తొలివారంలో నిర్వహించిన ఈ మిషన్ గురించిన సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది.

మిషన్​ వివరాలు ఇవే...

పరిశోధనలకు సంబంధించి భారత్​తో ఒప్పందాలున్న ఓ మధ్య ఆసియా దేశానికి 50 మంది శాస్త్రవేత్తల బృందం కొంత కాలం కిందట వెళ్లింది. అక్కడే వారిలో కొందరికి కరోనా సోకింది. ఆరోగ్యం విషమించడం వల్ల దౌత్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారిచ్చిన సమాచారంతో భారత వైమానిక దళం ప్రణాళిక రూపొందించింది.

అనంతంరం, వైమానిక దళం...సీ-17 గ్లోబ్ మాస్టర్ హెవీలిఫ్ట్ ట్రాన్స్​పోర్ట్ విమానాన్ని సిద్ధం చేసింది. దిల్లీ సమీపంలోని ఓ ఎయిర్​పోర్టు నుంచి 9 గంటలు ప్రయాణించి మధ్య ఆసియాలోని ఆ దేశానికి వెళ్లింది. అప్పటికే దౌత్యాధికారులు శాస్త్రవేత్తలను అక్కడి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. రెండు గంటల విరామం అనంతరం వారిని ఎక్కించుకుని విమానం తిరిగి వచ్చింది. దక్షిణ భారతంలోని ఓ ప్రాంతంలో వారిని దింపినట్లు సమాచారం.

ఇదీ చదవండి:'చెన్నై వలంటీర్​ నుంచి రూ. 100కోట్లు వసూలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details