తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"రాహుల్​ను ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే" - రాహుల్

రాహుల్​ గాంధీ పౌరసత్వంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు కేరళ వయనాడ్​కు చెందిన విశ్రాంత నర్సు రాజమ్మ వవతిల్​. రాహుల్​ జననానికి తానే సాక్ష్యమని తెలిపారు. దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో రాహుల్​ జన్మించినప్పుడు ఆయన్ని ఎత్తుకున్న వారిలో మొదటి వ్యక్తిని తానేనని వెల్లడించారు.

"రాహుల్​ను ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే"

By

Published : May 3, 2019, 7:02 PM IST

దేశంలో ఒకవైపు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పౌరసత్వంపై చర్చలు జరుగుతుంటే... మరోవైపు రాహుల్​ జననానికి తానే సాక్ష్యమని కేరళకు చెందిన విశ్రాంత నర్సు రాజమ్మ వవతిల్​ తెలిపారు. ఆయన పౌరసత్వంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవిగా చెప్పారు. దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 1970, జూన్​ 19న రాహుల్​ జన్మించారని వయనాడ్​కు చెందిన రాజమ్మ స్పష్టం చేశారు. రాహుల్​ జన్మించినప్పుడు ఎత్తుకున్న వారిలో మొదటి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు జన్మించిన రోజున ఆసుపత్రిలో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు వవతిల్​. డెలివరీ కోసం సోనియా గాంధీని ఆసుపత్రికి తీసుకొచ్చాక రాజీవ్​ గాంధీ, సంజయ్​ గాంధీ గది బయట వేచి ఉన్నారని తెలిపారు.

" అప్పుడే జన్మించిన రాహుల్​ను ఎత్తుకున్న వారిలో మొదటి వ్యక్తిని నేనే కావటం నా అదృష్టం. ఆయన చాలా అందంగా ఉన్నాడు. రాహుల్​ జననానికి నేనే సాక్ష్యం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మనవడిని చూడటం వల్ల మేమందరం పులకరించిపోయాం. 49 ఏళ్ల తరవాత ఆ శిశువు కాంగ్రెస్​ అధ్యక్షుడయ్యారు. రాహుల్​ వయనాడ్​ నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉంది. " - రాజమ్మ వవితిల్​, విశ్రాంత నర్సు, కేరళ

ఓ బ్రిటన్ సంస్థ తమ వార్షిక రిటర్న్​ల దాఖలులో భాగంగా రాహుల్​ బ్రిటన్​ పౌరునిగా పేర్కొంది. దీనిపై భాజపా నాయకుడు సుబ్రమణియన్​ స్వామి ఫిర్యాదు చేశారు. స్వామి ఫిర్యాదు పేర్కొంటూ కాంగ్రెస్​ అధ్యక్షునికి నోటీసులు జారీ చేసింది భారత హోంశాఖ.

రికార్డులు ఆసుపత్రిలో ఉన్నాయి...

రాహుల్​ గాంధీ పౌరసత్వంపై భాజపా నాయకుడు సుబ్రమణియన్​ స్వామి ఫిర్యాదు చేయటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు వవతిల్​. భారత పౌరుడిగా రాహుల్ గుర్తింపును ఎవరూ ప్రశ్నించలేరన్నారు. స్వామి ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. రాహుల్​ గాంధీ జననంపై అన్ని రకాల రికార్డులు ఆసుపత్రిలో ఉన్నాయని స్పష్టం చేశారు.

నర్సింగ్​ కోర్సు... సైన్యం

రాహుల్​ గాంధీ జన్మించిన సమయంలో దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్సింగ్​ కోర్సు చేశారు వవతిల్​​. అనంతరం భారత సైన్యంలో నర్సుగా విధులు నిర్వర్తించారు. 1987లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేరళలోని కల్లూర్​లో స్థిరపడ్డారు.

వయనాడ్​ పర్యటనకు రాహుల్​ గాంధీ వచ్చినప్పుడు ఆయన్ని కలిసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వవతిల్​.

ఇదీ చూడండి:'కాంగ్రెస్​లో చేరినా... ఆర్​ఎస్​ఎస్​ను వీడలేదు'

ABOUT THE AUTHOR

...view details