తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​తో అత్యున్నత మైత్రీబంధమే లక్ష్యం' - lanka president with modi

భారత్​తో అత్యున్నత స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ఈమేరకు దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరిపారు.

rajapaksa
'భారత్​తో అత్యున్నత మైత్రీబంధమే లక్ష్యం'

By

Published : Nov 29, 2019, 1:33 PM IST

భారత్​-శ్రీలంక మధ్య అత్యున్నత స్థాయిలో మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. భద్రత, ప్రజాసంక్షేమం లక్ష్యంగా ఇరుదేశాలు కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు.

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ విచ్చేసిన లంక అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్​ వద్ద రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతం పలికారు.

మోదీ, డోభాల్​తో సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్​ డోభాల్​తో హైదరాబాద్ హౌస్ వేదికగా విడివిడిగా సమావేశమయ్యారు రాజపక్స. ఇరుదేశాల మధ్య భద్రత, ఇతర రంగాల్లో సహకారంపై చర్చించారు.

మహాత్ముడికి నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం రాజ్​ఘాట్​ను సందర్శించిన గొటబాయ బాపూజీకి నివాళులు అర్పించారు. మహాత్ముడు అందరికీ స్ఫూర్తి అని సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు.

పొరుగుదేశం శ్రీలంక నూతన అధ్యక్షుడిగా పది రోజుల క్రితం ఎన్నికైన గొటబాయ రాజపక్స తన తొలి విదేశీ పర్యటనకు భారత్​ను ఎంచుకున్నారు.

ఇదీ చూడండి: 'గాడ్సే' వ్యాఖ్యలపై లోక్​సభలో ప్రగ్యా సింగ్​ క్షమాపణలు

ABOUT THE AUTHOR

...view details