రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాబాటుతో రాజకీయ సంక్షోభం తలెత్తడం వల్ల కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. అధిష్ఠానం ఆదేశంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా... ఏ పదవిలో ఉన్నవారైనా సరే తమ సమస్యను పార్టీ ముందు ప్రస్తావించాలని కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ భేటీకి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
"రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం నడిపించేందుకు కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరై.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలని అభ్యర్థిస్తున్నాను. ఏ పదవిలో ఉన్నవారైనా సరే తమ సమస్యను పార్టీ వేదికపై ప్రస్తావించండి. దాన్ని కలిసి పరిష్కరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల మధ్యే చర్చించుకోవాలి. సచిన్‌కు, ఇతర నాయకుల కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ నాయకత్వం తరపున స్పష్టం చేస్తున్నా."