తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ పక్క దేశంలో సీటు వెతుక్కోవాల్సిందే' - వాయనాడ్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేంద్ర మంత్రి పియూష్​ గోయల్​. రాహుల్​ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం ఆయన పక్క దేశాల్లో ఓ సీటు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు.

పియూష్​ గోయల్​

By

Published : Apr 21, 2019, 9:48 AM IST

Updated : Apr 21, 2019, 11:36 AM IST

ఈ ఎన్నికల్లో రెండు లోక్​సభ స్థానాల్లోనూ రాహుల్​ గాంధీ ఓడిపోతారని, 2024 ఎన్నికల నాటికి పక్క దేశాల్లోని ఓ సీటును ఆయన వెతుక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి పియూష్​ గోయల్​. ఉత్తరప్రదేశ్​లోని అమేఠీ, కేరళలోని వయనాడ్​ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు రాహుల్​.

వయనాడ్​లో పోటీ చేస్తూ తన ప్రత్యర్థిగా ఉన్న వామపక్ష అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం రాహుల్​ గాంధీకి లేదని విమర్శించారు పియూష్​.

రాహుల్​ గాంధీ, ఎస్పీ-బీఎస్పీ పొత్తు అంశాలపై కేంద్రమంత్రి పియూష్​ గోయల్​ మాటలు

" సీతారాం ఏచూరితో రాహుల్​ దిగిన చాలా ఫొటోలను చూశాం. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్​ వయనాడ్​ స్థానంలో పోటీకి వెళ్లారు. వామపక్షాలపై ఆయన పోటీ చేస్తున్నారు. కానీ నేను వాళ్లను విమర్శించబోనని రాహుల్​ చెబుతున్నారు. ఆయన భయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ధైర్యం లేని వారు దేశానికి సేవ చేయలేరు. అమేఠీలో రాహుల్​ను స్మృతి ఇరానీ ఓడిస్తారు. వయనాడ్​లోనూ ఆయన పరాజయం చెందుతారు. వచ్చే ఎన్నికల కోసం సీటు వెతుక్కోవడానికి రాహుల్​ పక్క దేశానికి వెళ్లాల్సి వస్తుంది."

- పియూష్​ గోయల్​, కేంద్ర మంత్రి

బయటికే వారి ఐక్యత

ఉత్తరప్రదేశ్​లో ఎస్పీ-బీఎస్పీ పొత్తుపైనా స్పందించారు పియూష్​ గోయల్​.

"చివరి ఆరు నెలల్లో ఎస్పీ-బీఎస్పీ నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలు వందల్లో చూపిస్తా. కొన్నిసార్లు కలిసి ఉంటారు. కొన్నిసార్లు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు. వేదికల మీద మాత్రం ఆ రెండు పార్టీల వారు చేతులు కలుపుతారు. వేదిక దిగితే అభిప్రాయాలను పూర్తిగా మార్చుకుంటారు."

- పియూష్​ గోయల్​, కేంద్ర మంత్రి

Last Updated : Apr 21, 2019, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details