తమిళనాడుకు చెందిన ఓ కార్పొరేట్ సంస్థ నడుపుతోన్న పలు విద్యా సంస్థలపై దాడులు నిర్వహించింది ఆదాయపన్ను శాఖ. ఈ క్రమంలో రూ.150 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది.
కోయంబత్తూర్, ఈరోడ్, చెన్నై, నమక్కల్ ప్రాంతాల్లోని విద్యా సంస్థల ప్రాంగణాల్లో బుధవారం దాడులు చేసినట్లు తెలిపింది సీబీడీటీ. వాటితో పాటు ఓ సివిల్ కాంట్రాక్టర్ సహా అనుబంధ సంస్థలు, భాగస్వాములపైనా దాడులు చేపట్టినట్లు ఓ ప్రకటన చేసింది.
" సుమారు రూ.150 కోట్ల వరకు లెక్కించని పెట్టుబడులు, ఇతర చెల్లింపులను గుర్తించాం. రూ. 5 కోట్ల నగదు జప్తు చేశాం. కొన్ని లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. దాడులు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నాం. "