తమిళనాడులో 18 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. చెన్నై, నమక్కల్, తిరునెల్వెలిలో ఉదయం నుంచి సోదాలు చేస్తోంది. ఎన్నికల కోసం డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేశారు అధికారులు.
మొదటగా చెన్నై, నమక్కల్‌లో పీఎస్కే ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన కంపెనీల్లో సోదాలు చేసింది ఐటీ శాఖ. అనంతరం డబ్బును సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో చెన్నై, తిరునెల్వెలిలోని పలు ఫైనాన్షియర్లు, దళారీల బృందాలపై దాడులు చేసింది.