తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సర్వేపల్లి జీవితం ప్రతి భారతీయుడికీ గర్వకారణం'

గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని.. ఉపాధ్యాయులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయన జీవన విధానం ప్రతి పౌరుడికీ గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

I pay my tributes to Dr.S. Radhakrishnan and his life, work and legacy will keep inspiring every Indian: VP
సర్వేపల్లి జీవితం ప్రతి భారతీయుడికీ గర్వకారణం

By

Published : Sep 5, 2020, 11:57 AM IST

స్వతంత్ర భారత రెండో రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణన్​ జయంతిని పురస్కరించుకొని.. నేడు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా.. పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయుడు, తత్వవేత్త, పండితుడు, రచయిత అయిన రాధాకృష్ణన్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్​ చేశారు. ఆయన జీవితం, పనివిధానం, వారసత్వం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని వెంకయ్య అన్నారు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారు వెంకయ్య.

వెంకయ్యనాయుడు ట్వీట్​

గురువుల సేవలను కొనియాడిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్​ వేదికగా వారి సేవలను కొనియాడారు. 'విద్యార్థుల ఆలోచనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ.. దేశాన్ని నిర్మిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు' అని అన్నారు మోదీ.

నరేంద్ర మోదీ ట్వీట్​

'ఆయన గొప్ప ఆలోచనాపరుడు'

'ఎంతోమంది పిల్లలకు మార్గనిర్దేశం చేస్తూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ సోదరులకు శుభాకాంక్షలు' అని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్వీట్​ చేశారు. రాధాకృష్ణన్​ గొప్ప ఆలోచనాపరుడు, వివేకవంతుడైన పండితులని ఈ సందర్భంగా సర్వేపల్లిని గుర్తుచేసుకున్నారు షా.

ఇదీ చదవండి:నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details