తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2020, 10:23 PM IST

Updated : Dec 28, 2020, 10:48 PM IST

ETV Bharat / bharat

'బీఫ్​ తినొద్దని చెప్పడానికి మీరెవరు ?'

గోవధ నిషేధం బిల్లుకు కర్ణాటక కేబినెట్​ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్​ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసం తినడమనేది తమ జీవన శైలిలో భాగమని, వద్దని చెప్పడానికి మీరెరని ప్రశ్నించారు.

'I eat beef, It is my food style, to say did not eat it who are you'
'బీఫ్​ తినొద్దని చెప్పడానికి మీరెవరు ?'

కర్ణాటక కేబినెట్​ గోవధ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్​ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

'నేను గొడ్డు మాంసం తింటాను, ఇది నా ఆహార శైలి, తినొద్దని చెప్పడానికి మీరేవరు' అంటూ మాజీ సీఎం ప్రశ్నించారు. రేసు కోర్స్ రోడ్డులోని కాంగ్రెస్​ భవన్​లో ఏర్పాటు చేసిన పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

"మనం నిర్ణయించుకున్న సూత్రాల పట్ల స్పష్టంగా, వాటికి కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో కాంగ్రెస్​ పార్టీ వెనక్కి తగ్గితే అది దేశంలోని పేద, దళిత, వెనుకబడిన వర్గాలకు ఎదురుదెబ్బ అవుతుంది." అని సిద్ధ రామయ్య పేర్కొన్నారు.

ఇప్పుడు తెచ్చిన గోవధ నిషేధ చట్టమేమీ కొత్తది కాదు. 1964లోనే కాంగ్రెస్​ ఆ చట్టాన్ని చేసింది. 'నేను గొడ్డు మాంసం తింటాను. అడగటానికి మీరేవరు? మిమ్మల్ని తినమని నేనేమి బలవంతం చేయట్లేదు. నాకు నచ్చింది నేను తింటాను.

- సిద్ధ రామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

రైతుల వద్ద ఉన్న వయసు మీరిన ఎద్దులు, ఆవులు, గేదేల పరిస్థితేంటని సిద్ధ రామయ్య ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'5 కోట్ల కొవిషీల్డ్ టీకాలు సిద్ధం- అనుమతి రాగానే పంపిణీ'

Last Updated : Dec 28, 2020, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details