తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత్రికేయులారా కరోనాతో జాగ్రత్త: జావడేకర్​ - పాత్రికేయులకు కరోనా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. మీడియా సంస్థలు కూడా తమ కార్యాలయ సిబ్బందితో పాటు, క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించే పాత్రికేయుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

I&B Min issues advisory, asks media persons covering COVID19-related incidents to take precautions
పాత్రికేయులారా కరోనాతో జాగ్రత్త: జావడేకర్​

By

Published : Apr 23, 2020, 7:54 AM IST

మీడియా రంగానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా కరోనా బారినపడుతున్న నేపథ్యంలో... ప్రింట్​, ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. కొవిడ్​-19 సంబంధిత సమాచారాల్ని ​సేకరించే జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

"విలేకరులు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్​లు లాంటి మీడియా వ్యక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొవిడ్​-19కు సంబంధించిన ఘటనలను కవర్ చేస్తుంటారు. కంటైన్మెంట్ జోన్లు, హాట్​స్పాట్లు సహా ఇతర కరోనా ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఇలాంటి పాత్రికేయులు... ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీడియా సంస్థలు కూడా తమ కార్యాలయ సిబ్బందితో పాటు, క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించే పాత్రికేయుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి."

- సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఒక్కరోజు తరువాత..

ఉత్తర్​ప్రదేశ్​, కర్ణాటక, దిల్లీ ప్రభుత్వాలు... తమ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇది జరిగిన ఒక్కరోజు తరువాత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా సంస్థలకు తాజా సూచనలు చేయడం గమనార్హం.

పాత్రికేయులకు కరోనా

చెన్నైలోని ఓ తమిళ న్యూస్ ఛానెల్​కు చెందిన కొంత మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అలాగే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​... ఏప్రిల్ 16, 17 తేదీల్లో 171 మంది పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 53 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

జర్నలిస్టులకు కరోనా సోకడంపై సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ ధరల పెంపు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!

ABOUT THE AUTHOR

...view details