తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్​ - ఓటమి

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని, అందువల్ల తాను ఆ పార్టీ సారథిని కానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరగా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్​కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్​

By

Published : Jul 3, 2019, 3:16 PM IST

Updated : Jul 3, 2019, 4:48 PM IST

కాంగ్రెస్​కు నేను అధ్యక్షుడ్ని కాదు: రాహుల్​

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంపై రాహుల్​ గాంధీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను ఇప్పటికే రాజీనామా చేశానని, పార్టీ అధ్యక్షుడిని కాదని ఆయన స్పష్టం చేశారు.

"నేను ఇక ఏ మాత్రమూ కాంగ్రెస్ అధ్యక్షుడిని కాను. నేను ఇప్పటికే రాజీనామా చేశాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సాధ్యమైనంత త్వరగా సమావేశమై నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలి."
-రాహుల్ గాంధీ

రుణపడి ఉన్నా...

తాను కాంగ్రెస్ వ్యక్తిగా జన్మించానని.. జీవితాంతం అలాగే కొనసాగుతానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

"నేను భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో రుణపడి ఉన్నాను. కాంగ్రెస్ తనను తాను పూర్తిగా మార్చుకోవాలి. ప్రజల గొంతుకలను నొక్కి పెడుతున్న భాజపాపై పోరాటం జరపాలి."-రాహుల్ గాంధీ

ఇదీ సంగతి..

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 52 సీట్లు మాత్రమే సాధించి... దారుణమైన ఓటమి చవిచూసింది. ఇందుకు బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాహుల్​గాంధీ మే 25న రాజీనామా సమర్పించారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రాజీనామాను ఆమోదించలేదు. పార్టీని కింది స్థాయి నుంచి అన్ని విధాలా సంస్కరించి, పునర్​ నిర్మించాలని రాహుల్​ను కోరింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు... రాహుల్​ గాంధీయే పార్టీకి సారథ్యం వహించాలని కోరుతున్నారు. కొంత మంది పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కూడా.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. రాజీనామా ఆలోచన మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ రాహుల్ పట్టువీడడం లేదు.

ఇదీ చూడండి: మహారాష్ట్ర: ముంబయిలో శాంతించిన వరుణుడు

Last Updated : Jul 3, 2019, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details