హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ఈ మందులను వైద్యులు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే అందించాలని తెలిపింది. వీరు మినహా ఈ మాత్రలను ఎవరూ తీసుకోరాదని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త రామన్ గంగాఖేడ్కర్ స్పష్టం చేశారు.
"మేం ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందరికీ ఉద్దేశించినది కాదు. వైద్యులు, నిర్ధరిత కేసుల సంబంధీకులకు మాత్రమే. అది కూడా వారి పూర్తి సమాచారం సేకరించి, అనుమతించిన తర్వాతే వాడాలి."