తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కదిలే ఇళ్లకు భలే గిరాకీ.. ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు!

సొంతిల్లు.. ప్రతిఒక్కరి కల. ఇంటినిర్మాణం ఏళ్ల వ్యవహారం. ఖర్చుతో కూడుకున్న పని. కలల సౌధం నిర్మించుకునేందుకు సరిపడా డబ్బు ఉన్నా, అంత సమయం కేటాయించే వీలు కొందరికి ఉండకపోవచ్చు. ఉద్యోగ బదిలీలు, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు మకాం మార్చే వాళ్లకు ప్రతిచోట అద్దె ఇళ్లలో ఉండడం కష్టంగా ఉండొచ్చు. ఇలాంటి వారికి చక్కని పరిష్కారం చూపిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మిత్రులు. ఆ పరిష్కారమేంటో చూద్దామా.

By

Published : Dec 31, 2020, 10:41 AM IST

mobile house, మొబైవ్ హౌజ్
లాభాలబాటలో మొబైల్​ హౌజ్​ వ్యాపారం

లాభాలబాటలో మొబైల్​ హౌజ్​ వ్యాపారం

ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. స్థలం ఎంపిక చేసుకోవడం దగ్గరనుంచి, పూర్తి అయ్యి ఇంట్లో అడుగు పెట్టేవరకు.. ఎన్నో సవాళ్లు, మరెన్నో మజిలీలు. అవన్నీ అధిగమించి, సొంతింటి కల నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు. తీరా.. ఓచోట ఇల్లు కట్టుకున్నాక వివిధ కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి, అద్దె ఇళ్లలో నివాసముండే వారూ ఉంటారు.

ఇలాంటి వారికి ఓ చక్కటి పరిష్కార మార్గంతో ముందుకొచ్చారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు జిలాని, విజయ్. గతంలో చేసిన క్రేన్ వ్యాపారానికి మార్కెట్ తగ్గి పోవడంతో .. ప్రత్యామ్నాయ వ్యాపారమార్గాల కోసం సాగించిన అన్వేషణలో విదేశాల్లో ఎక్కడికైనా తరలించే వీలున్న మొబైల్ హౌజ్‌లకు ఉన్న డిమాండ్ వీరిని ఆకట్టుకుంది. ఆ దిశగానే అడుగులు వేశారు.

"బయటి దేశాల్లో చూసినప్పుడు ఇలా చేయాలన్న ఆలోచన వచ్చింది."

-జిలాని, మొబైల్‌ హౌజ్ వ్యాపారస్థుడు

రెండేళ్ల క్రితం ఓ మొబైల్ డుప్లెక్స్ ఇల్లు నిర్మించుకుని, అక్కడినుంచే వ్యాపారానికి శ్రీకారం చుట్టారు జిలానీ, విజయ్. కొద్దికాలంలోనే స్థానికులు, తోటి వ్యాపారులు, నగరవాసుల్ని ఈ కాన్సెప్ట్ బాగా ఆకర్షించింది. తమకూ కట్టి ఇవ్వాలంటూ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. కలప, ఇనుము ప్రధాన ముడిసరకుగా వాడి, నెలన్నర నుంచి 2 నెలల్లోనే ఇంటినిర్మాణం పూర్తి చేస్తున్నారు. 200 నుంచి 500 చదరపు అడుగుల్లో సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూం, డుప్లెక్స్ ఇళ్లు కడుతున్నారు.

మంచి స్పందన..

కావాల్సిన చోటికి ఇంటిని తరలించే వెసులుబాటు ఉండటం, తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తవడం వల్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని అంటున్నారు నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, గోవాకు సైతం ఇళ్లు సరఫరా చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ- జీహెచ్​ఎంసీ కోసం 20 శౌచాలయాలు నిర్మించారు. కూకట్‌పల్లిలో ఓ బస్తీ దవాఖానాను డెలివరీ చేశారు. 20 ఏళ్ల మన్నిక ఉండే ఈ ఇంటికి, రీసేల్ వాల్యూ ఉంటుందని తెలిపారు నిర్వహకులు.

కొవిడ్ సమయంలో ఐసోలేషన్ కేంద్రాలుగానూ వీటిని వినియోగించుకోవచ్చని చెబుతున్నా రు జిలానీ మిత్రద్వయం. ఒక్కో ఇల్లు పరిమాణం, మోడల్‌ బట్టి 4 లక్షలనుంచి, 15 లక్షల రూపాయల వరకు అవుతుంది.

ఇదీ చూడండి :ప్రకృతితోనా మానవాళి వికృత క్రీడ?

ABOUT THE AUTHOR

...view details