తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్​కౌంటర్​పై మేనక

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై పలువురు ఎంపీలు భిన్నంగా స్పందించారు. హైదరాబాద్​లో ఎన్​కౌంటర్​ అక్షరాలా తప్పు అని వ్యాఖ్యానించారు భాజపా ఎంపీ మేనకా గాంధీ. దిశ కేసులో నిందితులను అలా ఇష్టం వచ్చినప్పుడు చంపడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

Hyd encounter horrifying, cannot kill people because you want to says Maneka Gandhi
అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్​కౌంటర్​పై మేనక

By

Published : Dec 6, 2019, 1:14 PM IST

Updated : Dec 6, 2019, 1:50 PM IST

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​ను తప్పుబట్టారు కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ మేనకా గాంధీ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదని అభిప్రాయపడ్డారు. నిందితులను ఎన్​కౌంటర్ చేయడం అమానుషం అన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు మనుషుల్ని చంపడం సబబు కాదని పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో అన్నారామె.

"ఇదేం బాగాలేదు. నేను ఎన్​కౌంటర్​లను పూర్తిగా వ్యతిరేకిస్తాను. దిశ నిందితులను చట్టపరంగా శిక్షించాల్సింది. ఎన్​కౌంటర్​ చాలా ప్రమాదకరమైన చర్య. అంత ఘోరానికి తెగబడ్డవారికి ఎలాగైనా ఉరి శిక్ష పడి ఉండేది కదా! కానీ... మీరు కావాలనుకున్నారు కాబట్టి.. మీకు మనుషుల్ని చంపే అధికారం లేదు.

నిర్భయ కేసు నిందితులకు శిక్ష పడలేదంటే.. అది చట్టంలోని లోపమే కానీ మనుషులది కాదు. చట్టం అమలు అయ్యేందుకు సమయం పడుతుంది. ఇప్పుడేదైతే అయ్యిందో

(ఎన్​కౌంటర్) ... దేశంలోనే చాలా భయానక చర్య. ఎందుకంటే మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. మీరు ముందే తుపాకీలతో కాల్చి చంపేస్తే.. కోర్టులు, పోలీసులు, చట్టాలు ఉండి ప్రయోజనం ఏంటి? తుపాకీతో ఎవరిని పడితే వారిని చంపడానికి ఇవన్నీ ఎందుకు?"
-మేనకా గాంధీ, భాజపా ఎంపీ

ఆలస్యమైందన్న జయ..

దిశ కేసు నిందితులను మూకదాడి ద్వారా చంపాలని ఇంతకుముందు పార్లమెంటులో బలంగా వాదించిన ఎస్పీ ఎంపీ జయా బచ్చన్​.. ఎన్​కౌంటర్​పై స్పందించారు. "ఎన్​కౌంటర్​ చాలా ఆలస్యంగా జరిగింది. అయితే... అసలు శిక్ష పడకపోవడంకన్నా ఇదే మేలు" అని అన్నారు.

ఇది చదవండి:'చట్టం తన పని తాను చేసుకుపోతుంది'

Last Updated : Dec 6, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details