ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని మొదటి రాత్రికి సిద్ధమవుతోన్న ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఫేస్బుక్లో తన భార్య వేరే వ్యక్తితో నగ్నంగా ఉన్న చిత్రాలు ప్రత్యక్షం కావడం చూసి షాక్కు గురయ్యాడు. బెంగళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హసన్ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతితో సుబ్రమణ్య నగర్లో నివాసముంటున్న వ్యక్తికి గతేడాది జూన్ 30న పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంప్రదాయ పూజల నేపథ్యంలో వధూవరులు శారీరకంగా దూరంగా ఉండాల్సి వచ్చింది.
తీరా ఫస్ట్నైట్కు ముహూర్తం కుదిరింది. రెండ్రోజుల్లో మొదటి రాత్రి ఉందనగా.. ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి ఖాతా నుంచి భర్తకు ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది. అందులో తన భార్య నగ్న చిత్రాలు సహా.. ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ఉంది. ఆ యువతి భర్త ఫొటోలు పంపిన వ్యక్తిని సంప్రదించగా... అసలు విషయం బయటపడింది.