తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యను వెలకట్టి స్నేహితులకు అమ్మేసిన భర్త! - husband sold his wife for money in rajasthan

తాళి మెడలో పడిన దగ్గర నుంచి భర్తే సర్వం అనుకుంది ఆ మగువ. కానీ డబ్బుకు ఆశపడిన ఆ భర్త.. భార్యను ఆటబొమ్మ చేశాడు. డబ్బు తీసుకుని కట్టుకున్న ఆలిని స్నేహితులకు అమ్మేశాడు. శారీరకంగా చిత్రవధకు గురైన ఆ భార్య.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ భర్త నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటన రాజస్థాన్​లో చోటుచేసుకుంది.

Husband sold wife to friend in udaipur
భార్యకు వెలకట్టి స్నేహితులకు అమ్మేసిన భర్త!

By

Published : Jun 13, 2020, 12:39 PM IST

రాజస్థాన్​ ఉదయ్​పుర్​ ఘంటాధర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. మానవత్వం సిగ్గుపడే ఘటన జరిగింది. డబ్బుపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను స్నేహితులకు అమ్మేశాడు ఓ కీచక భర్త.

చిత్రహింసలు పెట్టి...

జావేద్​ ఖాన్ నిత్యం మద్యం మత్తులో తేలుతుండేవాడు. ఆ మైకంలోనే.. స్నేహితులతో కలిసి భార్యను శారీరకంగా హింసించేవాడు. భార్యను అశ్లీలంగా చిత్రీకరించి... తాను చెప్పినట్టు చేయకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్​మెయిల్​ చేసేవాడు. తన వేదన పక్కవారికి చెప్పుకోలేక దుఃఖాన్ని దిగమింగి బతికింది ఆమె. తాజాగా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుని ఆమెను వారికి అప్పగించేశాడు జావేద్​.

భార్యకు వెలకట్టి స్నేహితులకు అమ్మేసిన భర్త!

శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురైనా బాధితురాలు ఆ నరకం నుంచి కాపాడమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమెకు వైద్యం అందించి.. భర్త జావేద్​ ఖాన్​, అతడి స్నేహితుడు మోనూను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ కలిపిన కథ: 4 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన సోదరి

ABOUT THE AUTHOR

...view details