తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెలికాప్టర్​లో తిప్పి భార్య కోర్కెను తీర్చి...

'ఎప్పుడో మాటల సందర్భంలో హెలికాప్టర్​లో చక్కర్లు కొట్టాలని ఉందండీ అంది, అంతే...! ఆ ఉపాధ్యాయుడిగా తన పదవీ విరమణ సందర్భంలో అర్థాంగి ముచ్చట తీర్చాడు భర్త. భార్యను హెలికాఫ్టర్​లో పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. రాజస్థాన్​లోని అల్వార్​లో జరిగిందీ సంఘటన.

హెలికాఫ్టర్​

By

Published : Sep 1, 2019, 6:47 AM IST

Updated : Sep 29, 2019, 1:03 AM IST

హెలికాప్టర్​లో తిప్పి భార్య కోర్కెను తీర్చి...

ఓ రోజు ఇంటిపై నుంచి హెలికాప్టర్​ వెళ్లింది. కింద డాబాపై నుంచి చూస్తున్న ఇల్లాలికి దానిపై పయనించాలని ఆశ కలిగింది... హెలికాప్టర్​లో కూర్చుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది... ఎంత ఖర్చవుతుంది వంటి ప్రశ్నలేసింది భర్తను. అంతే...! మనసులో ఆ రోజే అనుకున్నాడా ఉత్తమ భర్త... ఎలాగైనా తన భార్య సోమోటిని హెలికాప్టర్​లో తిప్పాలని నిర్ణయించుకున్నాడు... శనివారం తన పదవీ విరమణ రోజున.. ఆయన అర్థాంగిని చాపర్​లో తిప్పి ఆశ్చర్యపరిచాడు.

రాజస్థాన్​ అల్వార్​ జిల్లా మాలావళి గ్రామానికి చెందిన రమేశ్​ చంద్​ మీనా సీనియర్​ ఉపాధ్యాయుడు. లక్ష్మణ్​గఢ్​లోని ఓ పాఠశాలలో.. ఉపాధ్యాయ వృత్తిలో 34 ఏళ్లపాటు సేవలందించాడు. శనివారం తన పదవీ విరమణ సందర్భంగా భార్య కోర్కె తీర్చడం కోసం 3 లక్షల 70 వేలు ఖర్చు పెట్టి దిల్లీ నుంచి ఓ చాపర్​ను బుక్​ చేశాడు. స్కూల్​ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి సతీమణితో కలసి ఆ హెలికాప్టర్​లోనే వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హెలీప్యాడ్​ వద్ద భారీసంఖ్యలో గుమిగూడారు. ఇంటి వద్దా వారికి ఘనస్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు.

"హెలికాఫ్టర్​ ద్వారా మాకు ఎంత సంతోషం రావాలో అంతా వచ్చింది. చాలా మంచి పని చేశాను. హెలికాప్టర్​ బుక్ చేయడానికి కారణం... నా సతీమణిని అందులో తిప్పాలనుకోవడమే."

- రమేశ్​ చంద్ మీనా, భార్యను హెలికాప్టర్​లో తిప్పిన వ్యక్తి

హెలికాప్టర్​ ప్రయాణానికి అనుమతినిచ్చిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు రమేశ్​ చంద్​. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతుండగా.. మరొకరు ఎఫ్​సీఐలో ఇన్​స్పెక్టర్​.

ఇదీ చూడండి :భారత్​తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దం: ఖురేషీ

Last Updated : Sep 29, 2019, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details