తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యను చంపి.. మూడు రోజులు ఇంట్లోనే దాచిపెట్టి.. - Husband kills his wife for second marriage in karnataka

ఓ వ్యక్తి తన భార్యను చంపి మూడు రోజుల పాటు సొంత ఇంట్లోనే దాచిపెట్టిన దారుణ ఘటన కర్ణాటక కలబుర్గి జిల్లాలోని హిప్పరాగ గ్రామంలో చోటుచేసుకుంది. సంతానం లేకపోవడం, మరో వివాహానికి భార్య అంగీకరించకపోవడం వల్లే నిందితుడు ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భార్యను చంపి మూడు రోజులు ఇంట్లోనే దాచిపెట్టాడు

By

Published : Nov 5, 2019, 5:30 PM IST

కర్ణాటక కలబుర్గి జిల్లా అలంద తాలూకాలోని హిప్పరాగ గ్రామంలో ఘోరం జరిగింది. పిల్లలు పుట్టడంలేదనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను హత్యచేసి.. మూడు రోజులపాటు తన ఇంట్లోనే దాచిపెట్టాడు.

సంగీత, మృతురాలు

సంతానం కలగలేదని!

హిప్పరాగకు చెందిన 45ఏళ్ల శ్రీశైలక్​ సక్కరాగి డ్రైవర్​గా పనిచేసేవాడు. సంగీతను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారికి ఓ ఆడబిడ్డ పుట్టి చనిపోయింది. ఆ తరువాత ఆమెకు సంతానం కలుగలేదు. ఇదే విషయమై భార్యను ఎప్పుడూ వేధిస్తుండేవాడు శ్రీశైలక్​. మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దీనితో భార్యాభర్తల మధ్య మూడు రోజుల క్రితం గొడవ జరిగింది.

శ్రీశైలక్, నిందితుడు

సంతానం కలగడం లేదనే కోపం, మరో వివాహం చేసుకోవడానికి భార్య అంగీకరించకపోవడం వల్ల శ్రీశైలక్​ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆమె శవాన్ని మూడు రోజులపాటు తన ఇంట్లోనే దాచిపెట్టాడు. ఈ దురాగతం బయటకు పొక్కడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు.

శ్రీశైలక్​, అతని తల్లి పార్వతిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆదర్శం: అప్పు ఇవ్వలేదని బ్యాంకే పెట్టేసింది

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details