తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పక్కా 'పాము' స్కెచ్​తో భార్యను చంపేశాడు.. కానీ! - యూట్యూబ్​లో క్రైమ్ పాఠాలు నేర్చుకుంటున్న నిందితులు

మరో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భార్యను పాముతో కరిపించి హత్య చేసిన దారుణ ఘటన కేరళ కొల్లాం​లో జరిగింది. నిందితుడు యూట్యూబ్​లో క్రైమ్​ చేయడం ఎలానో నేర్చుకుని... ఓ పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన పాములుపట్టేవాడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Hubby arrested for getting wife killed by snake in Kerala
పాముతో పొడిపించి భార్యను హత్యచేసిన ప్రబుద్ధుడు

By

Published : May 25, 2020, 11:22 AM IST

ఓ వ్యక్తి తన భార్యను పాముతో కరిపించి చంపిన దారుణ ఘటన కేరళ కొల్లాం జిల్లా అంచల్​లో జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తేల్చారు.

అంచల్​ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యాభర్తలు. వీరి పెళ్లి సమయంలో సూరజ్​ 98 కాసుల బంగారం, నగదు కట్నంగా తీసుకున్నాడు. ఇప్పటికే చాలా బంగారం అమ్మేశాడు. కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్​... తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను అనుమానం రాకుండా హత్య చేయాలని పథకం వేశాడు.

యూట్యూబ్​లో క్రైమ్ పాఠాలు..

యూట్యూబ్​లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. తరువాత సురేష్​ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి పామును తీసుకున్నాడు. ఈ మార్చి 2న మొదటిసారిగా తన భార్య ఉత్రాపై హత్యాయత్నం చేశాడు. అయితే ఆమె సకాలంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు దక్కించుకోగలిగింది. అయితే సూరజ్​పై ఎవరికీ అనుమానం కలగలేదు. దీనితో అతనికి మరింత ధైర్యం వచ్చింది. దీనితో మే 6న మరోసారి హత్యకు కుట్ర పన్నాడు.

నిద్రపోతున్న భార్యపై...

సురేష్​ నుంచి ఓ పామును తీసుకున్న సూరజ్ దానిని బ్యాగులో దాచి ఉంచాడు. తరువాత ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేశాడు. ఆ పాము ఉత్రాను రెండు సార్లు కాటువేసింది. ఆ తరువాత ఆ పామును ఓ కంటైనర్​లో బంధించాలని సూరజ్ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. పాము ఇంటిలోని కబోర్డులోకి వెళ్లిపోయింది. దీనితో చేసేదేం లేక రాత్రంతా ఇంట్లోనే నిద్రపోకుండా ఉండిపోయిన సూరజ్​... ఉదయన్నే బయటకు వెళ్లిపోయాడు.

కూతురు మృతిపై అనుమానం

ఉత్రా పాము కాటుతో మరణించడం.. ఇంతకు ముందు కూడా ఆమె పాముకాటుకు గురికావడంపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సూరజ్​ను అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారణ చేశారు. దీనితో సూరజ్ కుట్ర మొత్తం బయటపడింది.

ఇదీ చూడండి:వలస వేదన: శ్రామికుల్ని ఆదుకోలేమా?

ABOUT THE AUTHOR

...view details