తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్ల పాటు ఆ ఇద్దరు ఎంపీలు సస్పెండ్​​! - ఎంపీలపై ఓంబిర్లా ఆగ్రహం

లోక్​సభలో కాంగ్రెస్​ సభ్యుల వ్యవహార శైలిపై స్పీకర్​ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంపీలు వెల్​లోకి దూసుకొచ్చి సభ కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని ఆక్షేపించారు. వీరిని 5 ఏళ్ల పాటు సస్పెండ్​ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఓంబిర్లా

By

Published : Nov 25, 2019, 4:26 PM IST

లోక్​సభలో కాంగ్రెస్ సభ్యుల వ్యవహార శైలిపై స్పీకర్​ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వెల్​లోకి దూసుకురావటం ఆమోదయోగ్యం కాదన్నారు.

"ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఘటన నన్ను చాలా బాధించింది. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యను సహనం వహించేది లేదు. సభలో గందరగోళం కారణంగా నేను మొదటిసారి వాయిదా వేయాల్సి వచ్చింది. సభ సజావుగా జరగాలి. వాయిదా పడకూడదు."

-ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​

అసలేం జరిగింది..?

మహారాష్ట్ర పరిణామాలపై ఉభయ సభల్లో కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన చేపట్టాయి. లోక్​సభలో కాంగ్రెస్ ఎంపీలు హిబీ ఈదెన్​, టీఎన్ ప్రతాపన్​ వెల్​లోకి దూసుకొచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ అని పెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

వీరిద్దరి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్​.. వారిని బయటకు పంపాలని మార్షల్స్​ను ఆదేశించారు. ఎంపీలను బయటికి పంపేందుకు ప్రయత్నించిన మార్షల్స్​ను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవటం వల్ల సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో సభను వాయిదా వేశారు స్పీకర్​.

ఐదేళ్లపాటు సస్పెన్షన్​!

వెల్​లోకి దూసుకొచ్చి దూకుడుగా ప్రవర్తించిన ఎంపీలు ఈదెన్​, ప్రతాపన్​ను 5 ఏళ్ల పాటు సస్పెండ్​ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సభలో జరిగిన విషయంపై క్షమాపణలు చెప్పేందుకు ఎంపీలు నిరాకరించడాన్ని స్పీకర్ తీవ్రంగా పరిగణిస్తున్నారని ఆయా వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: భాజపా, శివసేన మోసం చేశాయని కోర్టుకెక్కిన ఓటరు

ABOUT THE AUTHOR

...view details