తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో ల్యాండ్​లైన్ల ముందు వందల మంది క్యూ! - jk

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో ల్యాండ్​లైన్ ఫోన్ల వద్ద వందల మంది ప్రజలు క్యూలో నిల్చుంటున్నారు. తమ బంధువులతో మాట్లాడేందుకు గుమికూడుతున్నారు. ఈ పరిస్థితితో మొబైల్​ ఫోన్లు వచ్చాక కనుమరుగైన ప్రజాటెలిఫోన్లు కళకళలాడుతూ పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్నాయి.

శ్రీనగర్​లో ల్యాండలైన్ల ముందు వందల మంది క్యూ!

By

Published : Sep 4, 2019, 6:31 AM IST

Updated : Sep 29, 2019, 9:18 AM IST

జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాల్లో లాండ్​లైన్​ సేవలను పునరుద్ధరించారు. శ్రీనగర్​లోని వందలాది మంది ప్రజలు తమ బంధువులతో మాట్లాడటానికి లాండ్​లైన్ కోసం క్యూలో నిలబడుతున్నారు. మొబైల్ ఫోన్లు​ వచ్చాక ప్రజా టెలిఫోన్​ (పీసీఓ), లాండ్​లైన్​ వాడకం తగ్గిపోయింది. కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులతో వీటికి మళ్లీ డిమాండ్​ పెరిగింది.

గత నెలలో ఆర్టికల్​ 370 రద్దు బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు కశ్మీర్​లో మొబైల్​, ఇంటర్​ నెట్ సేవలను నిలిపివేసింది కేంద్రం. ప్రసుత్తం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సేవలను పునరుద్ధరించింది. ల్యాండ్​లైన్ అందుబాటులో లేని వారు ప్రజాటెలిఫోన్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్​ ఫోన్ల వినియోగం లేని పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రజా టెలిఫోన్లు రద్దీగా మారాయి.

శ్రీనగర్​లో​ ఓ స్థానికుడు దూర ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడేందుకు రెండు ల్యాండ్​లైన్లను​ ఏర్పాటు చేశాడు. తమ బంధువులతో మాట్లాడటానికి అతని ఇంటికి వందల మంది ప్రజలు వస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వారి నుంచి కొంత డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు.

"ఎక్కువ మంది రావటం వలన వారిని నిలువరించలేకపోయాం. కొంత మంది కాల్​ చేయటం కోసం గొడవ పడ్డారు. చివరికి వారి నుంచి కొంత రుసుము తీసుకోవాలనుకున్నాను."

-లాండ్​లైన్​ యజమాని.

టెలిఫోన్ అవసరం ఎక్కువగా ఉండటం వల్ల కశ్మీర్​ ప్రభుత్వం అన్ని పోలీస్​ స్టేషన్లల్లో ఉచిత టెలిఫోన్ సేవలను అందుబాటులో ఉంచింది.

బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయానికి కొత్తగా ల్యాండ్​లైన్​ సేవల కోసం వందల దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించాక సేవలను అందించగల ప్రదేశాలలో త్వరలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:'విక్రమ్'​ తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు

Last Updated : Sep 29, 2019, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details