మోటారు వాహనాల నూతన చట్టంపై దిల్లీలోని ట్రాన్స్పోర్ట్ వాహన యాజమానులు నిరసన బాటపట్టారు. దిల్లీ జంతర్‌మంతర్ వద్ద వందలాది మంది ఆందోళన ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు.
"మోటారు వాహనాల చట్టం-2019ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రజలకు పెద్ద భారంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడుతున్నాం. నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్రమోదీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి."
-వాహన యజమానుల సంఘం ప్రతినిధి