గుజరాత్ సూరత్‌లో వందలాది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చారు. భౌతిక దూరం నిబంధలనను ఉల్లంఘిస్తూ వరాచ్ఛ ప్రాంతంలో గుమిగూడారు. తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వీరిలో అనేక మంది స్థానికంగా డైమండ్ పాలిషింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు.
సూరత్‌లోనూ రోడ్డెక్కిన కూలీలు- లాక్డౌన్ 2.0పై అసహనం - gujarath daily wage earners
గుజారాత్‌లోని సూరత్‌లో వందలాది మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చారు. భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.
లాక్డౌన్ పొడిగింపుపై అసహనం- రోడ్లపైకి భారీగా కూలీలు
ఈ రోజుతో లాక్డౌన్ ముగుస్తుందని భావించినప్పటికీ.. మే 3వరకు పొడిగించడం వల్ల కార్మికులు తీవ్ర అసహనానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి కిషోర్ కనని కూడా ఘటనాస్థలానికి వెళ్లి కూలీలకు నచ్చజెప్పారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయని పోలీసులు వెల్లడించారు.
సూరత్‌లో కూలీలు ఇలా నిరసనలు చేపట్టడం ఇది రెండోసారి. గత శుక్రవారం ఇదే విధంగా రోడ్లపైకి వచ్చి భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు.