తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో 'కొవాగ్జిన్​​' క్లినికల్​ ట్రయల్స్

కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారుచేస్తోన్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ హ్యూమన్​ క్లినికల్ ట్రయల్స్​ను ఒడిశాలో ప్రారంభించింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొందరు ఆరోగ్యవంతులకు.. భువనేశ్వర్​లోని ఓ ఆస్పత్రిలో టీకా అందించారు.

By

Published : Jul 27, 2020, 7:57 PM IST

Human clinical trial of COVID-19 vaccine 'Covaxin' begins at Odisha hospital
కోవాగ్జిన్​ హ్యూమన్ క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభం

కొవిడ్​-19ను అరికట్టేందుకు భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాగ్జిన్​ హ్యూమన్​ క్లినికల్​ ట్రయల్స్​ సోమవారం ఒడిశాలో ప్రారంభమయ్యాయి.

భువనేశ్వర్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​- ఎస్​యూఎం ఆస్పత్రిలో బీబీవీ-152 కొవిడ్​ వ్యాక్సిన్​(కొవాగ్జిన్​) ట్రయల్స్​ నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వ్యాక్సిన్​ అందించామని ట్రయల్స్ ప్రధాన​ పరిశీలకులు డాక్టర్​ వెంకట్​ రావు తెలిపారు.

ఇదీ చదవండి:క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

ABOUT THE AUTHOR

...view details