తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర గవర్నర్​ మార్పుపై జోరుగా ఊహాగానాలు

మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మహా పరిణామాల నేపథ్యంలో ఆయనపై అనేక విమర్శలు రావటం ఈ ప్రచారానికి అదనపు బలం చేకూర్చుతున్నాయి. ఆయన స్థానంలో రాజస్థాన్ గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.

huge speculations on maharastra governer change
huge speculations on maharastra governer change

By

Published : Nov 28, 2019, 5:05 AM IST

మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని మారుస్తారని ప్రచారం సాగుతోంది.

ఆయన స్థానంలో రాజస్థాన్​ గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే.. గవర్నర్‌ కోశ్యారీని కలిసిన కాసేపటికే ఈ ప్రచారం మొదలైంది.

కోశ్యారీ తీరుపై విమర్శలు..

మహా రాజకీయ నాటకంలో గవర్నర్‌ కోశ్యారీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు కోశ్యారీ సిఫార్సు చేయడం చర్చనీయాంశమయింది.

ఆ తర్వాత భాజపాకు మద్దతిస్తానంటూ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ముందుకు రాగానే.. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ భాజపాను ఆహ్వానించడం, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేయడం క్షణాల్లో జరిగాయి. ఈ పరిణామాలతో గవర్నర్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో కోశ్యారీ మార్పుపై ఊహాగానాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: ఉద్ధవ్​ ప్రమాణ స్వీకారంపై బొంబాయి హైకోర్టు 'ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details