కర్ణాటక చిక్‌మంగళూరులో ఓ భారీ కొండచిలువను స్థానికులు పట్టుకున్నారు. సుమారు 14 అడుగులు పొడవుండే ఈ పాము.. ముదిగెరె ప్రాంతంలోని ఓ కాఫీ తోటలో బయటపడింది.
వామ్మో.. కాఫీ తోటలో 14అడుగుల కొండచిలువ
ఓ భారీ కొండ చిలువ.. కర్ణాటక చిక్మంగళూరు పంటపొలాల్లో దర్శనమిచ్చింది. అనంతరం స్థానికులు దాన్ని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
కాఫీ తోటలో బయటపడ్డ 14అడుగుల భారీ కొండచిలువ
కొండచిలువ ఉన్న విషయాన్ని.. స్థానిక పాముల ప్రేమికుడు రిజ్వాన్‌తో చెప్పారు పొలం యజమాని. తక్షణమే అక్కడికి చేరుకున్న రిజ్వాన్.. చాకచక్యంగా వ్యవహరించి ఆ కొండచిలువను రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి:వ్యవసాయంపై మక్కువతో మేడపైనే వరిసాగు
Last Updated : Nov 1, 2020, 9:05 PM IST