కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా భక్తల్ తాలూకా బైలార్ పంచాయతీ పరిధిలో జనావాసాల మధ్యలోకి వచ్చిన భారీ కొండచిలువను అటవీ శాఖ అధికారులు రక్షించారు.
జనావాసాల్లోకి కొండచిలువ- స్థానికులు హడల్ - వణ్యప్రాణి సంరక్షణ
కర్ణాటకలో ఇళ్ల మధ్యలోకి వచ్చిన భారీ కొండచిలువను చూసి హడలెత్తిపోయారు స్థానికులు. 14 అడుగుల కొండచిలువను అటవీ శాఖ సిబ్బంది రక్షించి అడవిలో వదిలేశారు.
python
దాదాపు 14 అడుగుల పొడవు, 25 నుంచి 30 కిలోల బరువుతో ఉన్న కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ కలకలంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మన్‌కీ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని భారీ వన్యప్రాణిని రక్షించారు. అనంతరం స్థానికుల సాయంతో అడవిలోకి విడిచిపెట్టారు.
Last Updated : Sep 24, 2020, 12:06 PM IST