తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారి కోసం ప్రత్యేకంగా 1000 ఆర్టీసీ బస్సులు - భారతదేశంలో కరోనా వైరస్

కరోనాను తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. రోడ్డు మీద ఒకరు, ఇద్దరు కనిపిస్తేనే పోలీసులు శిక్షిస్తున్నారు. మరి ఉత్తర్​ప్రదేశ్-దిల్లీ సరిహద్దుల్లో వందలాది మంది గుమిగూడారు. ఎందుకో తెలుసా...?

Huge crowd near Delhi-UP border as travellers wait to take buses home
లాక్​డౌన్​ కొనసాగుతున్నా.. బారులుతీరిన జనం!

By

Published : Mar 28, 2020, 1:30 PM IST

Updated : Mar 28, 2020, 1:55 PM IST

ఉత్తర్​ప్రదేశ్​-దిల్లీ సరిహద్దు గాజియాబాద్​లో వందలాది మంది వలస కార్మికులు, సొంతింటికి వెళ్లేందుకు బస్సుల కోసం వేచి చూస్తున్నారు.

లాక్​డౌన్​ కొనసాగుతున్నా.. బారులుతీరిన జనం!

ప్రత్యేక బస్సులు..

దేశవ్యాప్త లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం దిల్లీ నుంచి ప్రతి రెండు గంటలకు ఓ బస్సు సౌకర్యం కల్పించింది. ఇతర ప్రధాన ప్రాంతాలతో కలుపుకుని మొత్తం 1000 బస్సులు నడుపుతోంది. దీంతో సమయానికి బస్సును అందుకునేందుకు జనం బస్టాండుల్లో బారులు తీరారు.

Last Updated : Mar 28, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details