హరియాణా శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకుని ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులపై పరుష వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత దీపేంద్ర సింగ్ హుడా. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న ఆయన.. స్వతంత్ర అభ్యర్థులు భాజపాతో కలిస్తే పాదరక్షలతో శిక్షిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపాతో కలిస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ప్రకటించారు.
సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలాతో చర్చించామని తెలిపారు దీపేంద్ర. కాంగ్రెస్- జేజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్వతంత్ర ఎమ్మెల్యేలపై హుడా పరుషవ్యాఖ్యలు
"స్వతంత్ర ఎమ్మెల్యేలపై పలు విషయాలు మీరు చెప్తున్నారు. కొంతమంది స్వతంత్రులతో మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. కానీ భాజపాతో కలిసేవారు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు. సామాజిక మాధ్యమాల్లో భాజపా నేతలను కలసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల చిత్రాలు చక్కర్లు కొట్టాయి. ఇది చాలా తప్పు. భాజపాతో కలిసేవారు ప్రజా విశ్వాసాన్ని అమ్మేస్తున్నారు. ఖట్టర్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్వతంత్రులైనా, ఇంకెవరైనా వారిని రానున్న రోజుల్లో ప్రజలు పాదరక్షలతో శిక్షిస్తారు. క్షమించబోరు."
-దీపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వ్యూహాలు.. దిల్లీకి ఖట్టర్