అపార జ్ఞాపకశక్తితో మూడేళ్ల వయసులోనే దుమ్మురేపుతున్నాడు కర్ణాటక హుబ్లీకి చెందిన చిచ్చరపిడుగు అద్వైత్ సర్దేశ్ముఖ. ఏడు ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు-వాటి రాజధానులు, సౌరమండలంలోని గ్రహాల పేర్లను చెబుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2020లో స్థానం సంపాదించుకున్నాడు.
అద్వైత్ వయసు ఇప్పుడు 3ఏళ్ల 10నెలలు. రాష్ట్రాలలోని జిల్లాలు, కాలచక్రం, 20నక్షత్రాలు, కన్నడ-ఆంగ్ల భాషల్లో 1-100 నెంబర్లు, హిందీలో 1-50 నెంబర్లు, శ్లోకాలు, విష్ణుమూర్తి అవతారాలు, ఆంగ్ల కవితలు, కన్నడలోని చిన్న చిన్న కథలు, ప్రధానమంత్రితో పాటు వివిధ మంత్రుల పేర్లను చకచకా చెప్పేస్తుంటాడు ఈ బుడతడు.