తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిట్రోడా వ్యాఖ్యలు దురహంకారానికి ప్రతీక' - ratlam

కాంగ్రెస్​పై విమర్శలను తీవ్రతరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే వాళ్ల దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్​ రత్లాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ.

ఆ వ్యాఖ్యలు వాళ్ల దురహంకారానికి నిదర్శనం:మోదీ

By

Published : May 13, 2019, 1:35 PM IST

Updated : May 13, 2019, 2:13 PM IST

కాంగ్రెస్ దురహంకారానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 1984 సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్​ నేత శామ్​ పిట్రోడా 'జరిగిందేదో జరిగింది' అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మహాకూటమి పార్టీలపై ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం లేదన్నారు మోదీ. వారికి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. మధ్యప్రదేశ్​ రత్లాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని.

మధ్యప్రదేశ్​లో రైతుల పంటరుణాలు మాఫీ హామీని నెరవేర్చడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మోదీ. భోపాల్​ లోక్​సభ అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్​ సింగ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని విమర్శించారు.

ఇదీ చూడండి: దేశంలో మొదటి ఉగ్రవాది హిందువే: కమల్​

Last Updated : May 13, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details