దిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘర్షణపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పందించింది. విద్యార్థులపై దాడికి సంబంధించి సత్వర నివేదికను సమర్పించాలని జేఎన్‌యూ రిజిస్ట్రార్‌ను కోరింది.
జేఎన్‌యూలో జరిగిన ఘర్షణ గురించి వర్శిటీ రిజిస్ట్రార్‌ను నివేదిక సమర్పించమని కోరాం. విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పాలని ఉపకులపతి, పోలీసు అధికారులతో మాట్లాడాము.
-హెచ్ఆర్డీ అధికారులు.
షా...
ఈ ఘర్షణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనకు గల కారణాలను ఆరా తీసి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశం ఇచ్చారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రియాంక గాంధీ..
ఈ దాడిలో గాయపడినవారిని ఎయిమ్స్‌కి వచ్చి పరామర్శించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుర్తు తెలియని దుండగులు కొంతమంది జేఎన్‌యూ ప్రాంగణంలో చొరబడి ముసుగులు ధరించి విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చూడండి : మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి