హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 'ప్రఖ్యాత సంస్థ'ల జాబితాలో హెచ్సీయూకు చోటు దక్కింది. ఈ జాబితాలో హెచ్సీయూతో పాటు ఐఐటీ ఖరగ్పుర్, ఐఐటీ మద్రాస్, దిల్లీ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉన్నాయి.
ఈ 5 సంస్థలతో పాటు మరో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అత్యున్నత స్థాయి ప్రకటించాలని విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ గత నెల సిఫార్సు చేసింది. వాటిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.