తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ విద్యార్థుల 'ఛలో పార్లమెంట్'​ ఉద్రిక్తం - latest jnu news

జేఎన్​యూలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సూచనలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ.. త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుంది. మరోవైపు ఫీజుల పెంపుతో పాటు మరిన్ని సమస్యల పరిష్కారానికై విద్యార్థులు చేపట్టిన ఛలో పార్లమెంట్​ మార్చ్​ ప్రారంభమైంది.

జేఎన్​యూ 'ఛలో పార్లమెంట్'​ షురూ.. 'త్రిసభ్య కమిటీ' ఏర్పాటు

By

Published : Nov 18, 2019, 1:19 PM IST

Updated : Nov 18, 2019, 1:51 PM IST

జేఎన్​యూ 'ఛలో పార్లమెంట్'​ షురూ.. 'త్రిసభ్య కమిటీ' ఏర్పాటు

దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ)విద్యార్థులు పిలుపునిచ్చిన ఛలో పార్లమెంట్​ మార్చ్​ ప్రారంభమైంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో నిరసనల్లో భాగంగా విద్యార్థులు పార్లమెంట్​ వరకూ మార్చ్​ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. భద్రత కట్టుదిట్టం చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల.. సుమారు 8 వందల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పార్లమెంట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

త్రిసభ్య కమిటీ ఏర్పాటు

విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సూచనలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ...త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. విద్యార్థులు, వర్సిటీ యంత్రాంగంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుంది. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి.. సూచనలు చేస్తుంది. హాస్టల్ మాన్యువల్ ముసాయిదా, హాస్టల్ఫీజుల పెంపు, డ్రెస్​కోడ్​కు నిరసనగా విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.

మూడు వారాలుగా నిరసనలు

ఇటీవల వసతి గృహాల ఫీజులు పెంచుతూ జేఎన్​యూ కార్యనిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనపై తీవ్ర చేఆగ్రహం వ్యక్తం సిన విద్యార్థులు దాదాపు మూడు వారాల నుంచి ఆందోళన చేపట్టారు.

ఇదీ చూడండి : జేఎన్​యూ ఫీజుల పెంపుపై విద్యార్థుల పోరు తీవ్రం

Last Updated : Nov 18, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details