కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి సిలబల్ను, బోధనా సమయాన్ని తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత తరుణంలో విద్యార్థుల తలిదండ్రులు, అధ్యాపకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్.
సిలబస్, బోధనా సమయాన్ని కుదింపునకు సంబంధించి సలహాలు, సూచనలను పంచుకోవాలని ఉపాధ్యాయులను, విద్యావేత్తలను కోరారు. వారి అభిప్రాయాలను 'హ్యాష్‌ట్యాగ్ సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020'కి ట్యాగ్ చేయాలని సూచించారు.