తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీజీపీ స్వీయ నిర్బంధం- ఆఫీస్​ బంద్ - హిమాచల్​ ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ

హిమాచల్​ ప్రదేశ్​ పోలీస్​ ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆ రాష్ట్ర డీజీపీ సంజయ్​ను కలిసిన ఓ వ్యక్తి.. కరోనాతో మరణించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంజయ్​, మరో 30 మంది పోలీసు అధికారులు గృహ నిర్బంధంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

HP police headquarters sealed; DGP, 30 other officers in self-quarantine after coronavirus scare
రాష్ట్ర పోలీస్​ ప్రధాన కార్యాలయాన్ని మూసివేసిన అధికారులు

By

Published : Jun 9, 2020, 5:44 PM IST

హిమాచల్​ ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సంజయ్​ కుండు, మరో 30 మంది అధికారులు గృహనిర్బంధంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. డీజీపీని కలిసిన ఓ వ్యక్తి మంగళవారం కరోనా మహమ్మారితో మృతి చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంజయ్​ కుండు జూన్​ 1 ఆ రాష్ట్ర డీజీపీగా పదవీ భాద్యతలు చేపట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి ప్రధాన కార్యాలయానికి ఓ వ్యక్తి వచ్చాడు. తర్వాత సదరు వ్యక్తి దిల్లీకి వెళ్లాడు. అతడికి వైరస్​ పరీక్షలు నిర్వహించగా సోమవారం పాజిటివ్​గా నిర్ధరణ అయ్యిందని, మంగళవారం మరణించినట్లు పోలీసు శాఖ ప్రతినిధి కుషాల్​ శర్మ తెలిపారు.

ఈ వార్త తెలిసిన అనంతరం డీజీపీ, మరో 30 మంది అధికారులు గృహ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు కుషాల్. ప్రధాన కార్యాలయాన్ని శానిటైజ్​ చేయటం కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారుల నుంచి నమూనాలను సేకరించినట్లు వివరించారు.

ఇదీ చూడండి:'జూన్​ 30 వరకు చార్​ధామ్​ యాత్రకు అనుమతి లేదు'

ABOUT THE AUTHOR

...view details