- హ్యూస్టన్ వేదికగా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్-అమెరికా దేశాలు సంకల్పించాయి. పాకిస్థాన్‌కు మరోసారి పరోక్ష హెచ్చరికలు పంపారు మోదీ-ట్రంప్.
- ఇరుదేశాల మధ్య సరికొత్త బంధానికి నాంది పలికారు మోదీ-ట్రంప్. కీలక రంగాల్లో సహకారం పెంపు ఆవశ్యకతను ప్రస్తావించిన ఇరు దేశాధినేతలు.. రక్షణ రంగంలో ఒప్పందాలు ఖాయమన్న సంకేతాలిచ్చారు.
- గత ఐదేళ్లలో భారత్‌లో వచ్చిన మార్పు వివరించిన మోదీ... నవభారత్ సహా భవిష్యత్ లక్ష్యాలను ట్రంప్‌నకు, అలాగే ప్రవాల భారతీయలుకు వినిపించారు.
పాక్‌కు 'మోదీ - ట్రంప్' పరోక్ష హెచ్చరిక
00:18 September 23
హౌడీ-మోదీ కార్యక్రమం ముఖ్యాంశాలు..
00:10 September 23
'భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త శకం'
- బేరసారాల విషయంలో ట్రంప్ కఠినంగా ఉంటారని అందరూ అంటారు:మోదీ
- ఒప్పందాలు కుదర్చడంలో ట్రంప్ మరింత కఠినంగా ఉంటారు:మోదీ
- భారత్,అమెరికా ఇప్పుడు మరింత ముందడుగు వేయాలి:మోదీ
- ఆ దిశగా నిర్మాణాత్మక కార్యక్రమం కొనసాగుతోంది:మోదీ
- ఈ వేదిక నుంచి భారత్,అమెరికా సంబంధాల్లో కొత్త శకం మొదలైంది:మోదీ
00:05 September 23
అసంభవం అనుకున్నవి చేసి చూపించాం : మోదీ
- భారత్.. సమస్యలను సహించడం లేదు, ఎదురునిలిచి పోరాడుతోంది: మోదీ
- అసంభవం అనుకున్న అనేక విషయాలను భారత్ చేసి చూపిస్తోంది: మోదీ
-
కార్పొరేట్ పన్ను తగ్గింపును హూస్టన్ చమురుసంస్థల సీఈవోలు స్వాగతించారు: మోదీ
-
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ కోసం భారత్ నిరంతరం శ్రమిస్తోంది: మోదీ
-
ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది: మోదీ
00:02 September 23
ఉగ్రవాదంపై ప్రధాని ఆగ్రహం
- అమెరికాలో 9/11, భారత్‌లోని 26/11.. ఈ కుట్రలు ఎక్కడ జరిగాయో అందరికీ తెలుసు: మోదీ
- ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన పోరు జరగాలి: మోదీ
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు: మోదీ
- ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న ట్రంప్ సంకల్పానికి మనమంతా మద్దతిద్దాం: మోదీ
- ఎంతో గొప్ప ఉద్దేశాలతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని నిర్ణయించాం: మోదీ
23:53 September 22
ఆర్టికల్ 370 రద్దుపై మోదీ ప్రసంగం
- 70 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు స్వస్తి పలికాం: మోదీ
- అదేంటో మీకు అర్థమైంది.. అదే 370 ఆర్టికల్ రద్దు: మోదీ
- 370 మూలంగా 70 ఏళ్ల నుంచి జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు సమానత్వానికి దూరమయ్యారు: మోదీ
- జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాలన్నీ లభించాయి: మోదీ
- 370పై పార్లమెంటులో జరిగిన చర్చను భారత్‌తోపాటు ప్రపంచమంతా చూసింది: మోదీ
- రాజ్యసభలో మా పార్టీకి బలం లేకున్నా 2/3 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది: మోదీ
- ఇది భారత్ ప్రజాస్వామ్యంలోని అత్యంత అరుదైన సంప్రదాయం: మోదీ
- ఈ సమష్టి నిర్ణయం భారత ప్రజాస్వామ్య పటిష్టతకు నిదర్శనం: మోదీ
- ఉగ్రవాదాన్ని సమర్థించేవాళ్లు, పెంచిపోషించేవాళ్లు ఎవరన్నది ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది: మోదీ
23:51 September 22
సంక్షేమ పథకాలు అవసరం: మోదీ
- భారత్‌లోని సామాన్య జనజీవనానికి సంక్షేమ పథకాలు అవసరం: మోదీ
- భారత్‌లో అక్టోబరు నుంచి ఓడీఎఫ్ కనుమరుగు కానుంది: మోదీ
23:49 September 22
అతి తక్కువ ధరకే డేటా: మోదీ
- ప్రపంచంలో అన్నిదేశాల కంటే భారత్‌లోనే తక్కువధరకు డేటా లభ్యం: మోదీ
- అమెరికా కరెన్సీలో 20 సెంట్లకే భారత్‌లో డేటా లభిస్తుంది: మోదీ
- ఇది ప్రపంచంలోనే తక్కువ ధర: మోదీ
- ఇప్పుడు వారంలోనే పాస్‌పోర్టు ఇంటికి వస్తోంది: మోదీ
- ఇదంతా డిజిటల్ ఇండియా సాధించిన ఘనత: మోదీ
23:44 September 22
కొత్త కలల సాకారం దిశగా: మోదీ
- దేశ జనాభా కనీస అవసరాలు దాటి కొత్త కలల సాకారం దిశగా వెళ్తోంది: మోదీ
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ మరింత సరళతరంగా మారుతుంది: మోదీ
- జాతిమొత్తాన్నీ శక్తిమంతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది: మోదీ
23:42 September 22
ముందుకెళ్తున్నాం: మోదీ
- ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నాం: మోదీ
- ఐదేళ్లలో గ్యాస్ వినియోగం 50 నుంచి 95 శాతానికి తీసుకెళ్లాం: మోదీ
- గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థను 95 శాతానికి తీసుకెళ్లాం: మోదీ
- 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశాం: మోదీ
- ఐదేళ్లలో 2 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించాం: మోదీ
- గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేశాం: మోదీ
- 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించాం: మోదీ
23:39 September 22
ప్రజాభాగస్వామ్యం: మోదీ
- ఇప్పుడు భారత్‌లో అతిపెద్ద సూత్రం.. ప్రజా భాగస్వామ్యం: మోదీ
- 'సంకల్పం నుంచి సాకారం వరకు'.. ఇదే భారత్ కొత్త నినాదం: మోదీ
- నవీన భారత నిర్మాణమే ఈ సంకల్పానికి లక్ష్యం: మోదీ
- మమ్మల్ని మేమే పోటీదారులుగా భావిస్తున్నాం: మోదీ
- మాలో నిరంతంరం మార్పును అన్వేషిస్తున్నాం: మోదీ
- గత ఐదేళ్లలో ఎవరూ కలలో కూడా ఊహించనంత ముందుకెళ్లాం: మోదీ
23:37 September 22
భారతీయుల సంకల్పం: మోదీ
- భారత్‌లో ఈసారి ఎన్నికల్లో 8 కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటేశారు: మోదీ
- 60 ఏళ్ల తర్వాత అత్యంత బలమైన ప్రభుత్వం భారత్‌లో ఏర్పడింది: మోదీ
- ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత మరింత శక్తిమంతమైన ప్రభుత్వం ఏర్పడింది: మోదీ
- ఇదంతా మోదీ ప్రతిభ వల్ల జరిగింది కాదు.. భారతీయుల సంకల్పం వల్ల జరిగింది: మోదీ
- ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు భారత ప్రగతికి నిదర్శనం: మోదీ
23:34 September 22
భిన్నత్వంలో ఏకత్వం: మోదీ
- భిన్నత్వం, ప్రజాస్వామ్యం.. భారత్‌లోని విలువలకు, కట్టుబాట్లకు నిదర్శనం: మోదీ
- ఇక్కడున్న 50 వేల మంది.. భారతీయ సంస్కృతికి ప్రతినిధులు: మోదీ
- అమెరికా జనాభా కంటే రెట్టింపు ప్రజలు భారత్ ఎన్నికల్లో పాల్గొన్నారు: మోదీ
23:32 September 22
అందరూ బాగున్నారా: మోదీ
- అందరూ బాగున్నారా అంటూ అనేక భారతీయ భాషల్లో సంబోధించిన మోదీ
- భారతీయ భాషలు స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక: మోదీ
- అనేక భాషలు, సంస్కృతులు.. ఒకే దేశం మా విధానం: మోదీ
- అనేకానేక ఆచారాలు, వేషభాషలు, పూజావిధానాలు మా సొంతం: మోదీ
- భిన్నత్వంలో ఏకత్వం భారతీయ జీవన సంస్కృతి: మోదీ
23:30 September 22
మోదీ 130 కోట్ల మంది ప్రతినిధి: ప్రధాని
- క్షణక్షణం మారిపోయే హ్యూస్టన్‌లో గొప్ప ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు: మోదీ
- ఈ కార్యక్రమం పేరు 'హౌడీ మోదీ'.. కాని మోదీ ఒంటరిగా ఏ ప్రాధాన్యం లేని వ్యక్తి: మోదీ
- 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా మోదీ చాలా శక్తిమంతుడు: మోదీ
23:27 September 22
ట్రంప్ మాటలు గర్వకారణం: మోదీ
- భారత్ ఉన్నతి, అభివృద్ధి గురించి వారు చెప్పిన ప్రతిమాట గర్వకారణం: మోదీ
- ఈ ప్రశంసలు, గౌరవం 130 కోట్ల మంది భారతీయులకు చెందుతుంది: మోదీ
- ఈ సభకు వచ్చేందుకు ఎంతోమంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు: మోదీ
- స్థలాభావం వల్ల వేలమంది ఈ సభకు రాలేకపోయారు: మోదీ
23:24 September 22
కలలో కూడా ఊహించలేదు: మోదీ
- ఈ దృశ్యం.. ఈ వాతావరణం.. కలలో కూడా ఊహించనిది: మోదీ
- టెక్సాస్ విశాల దృక్పథం మనందరికీ స్ఫూర్తిదాయకం: మోదీ
- ఓ కొత్త చరిత్రను చూస్తున్నాం: మోదీ
- భారత్, అమెరికాల కొత్త బంధం కూడా మనకు సాక్షాత్కారం అవుతుంది
- ప్రపంచ ఎనర్జీ రాజధాని హ్యూస్టన్ ఈ కొత్త చరిత్రకు వేదిక అవుతుంది
- ట్రంప్, సెనేటర్లు.. భారత్ గురించి మంచిమాటలు చెప్పడం ఉత్సాహం ఇస్తోంది
23:18 September 22
సరిహద్దు భద్రతలో సహకారమిస్తాం: ట్రంప్
- సరిహద్దు భద్రత అనేది భారత్, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశం: ట్రంప్
- సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తాం: ట్రంప్
- చట్టబద్ధమైన వలసదారులకు అమెరికా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: ట్రంప్
- చట్టబద్ధంగా ఉద్యోగాలు సంపాదించి పన్నులు కట్టేవారిని అమెరికా గౌరవిస్తోంది: ట్రంప్
- అక్రమ వలసదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం: ట్రంప్
- అమెరికాలోని ప్రతి కుటుంబం అత్యంత సురక్షితంగా జీవించాలని కోరుకుంటున్నాం: ట్రంప్
23:15 September 22
ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో మేమున్నాం: ట్రంప్
- ముడిచమురు ఉత్పత్తులు కూడా భారత్‌కు అమెరికా నుంచి వెళ్తాయి: ట్రంప్
- భారత్-అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయి: ట్రంప్
- అనేకరకాల రక్షణ ఉత్పత్తుల వాణిజ్యం ఇరుదేశాల మధ్య సాగనుంది: ట్రంప్
- నవంబరులో త్రివిధదళాల విన్యాసాలు చేపడతాం: ట్రంప్
- 'టైగర్ ట్రయో' పేరుతో ఈ విన్యాసాలు చేపడతాం: ట్రంప్
- ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా అండగా నిలబడుతుంది: ట్రంప్
- భారత్, అమెరికా రెండూ సరిహద్దుల రక్షణకు పరస్పరం సహకరించుకుంటాయి: ట్రంప్
23:13 September 22
భారత్‌కు అన్నివిధాలా సాయం చేస్తాం...
- ఓహియో రాష్ట్రంలో భారతీయ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారం నిర్మిస్తుంది: ట్రంప్
- గతంలో ఎప్పుడూ లేనంతగా అమెరికాలో భారత్ పెట్టుబడులు పెడుతోంది: ట్రంప్
- అమెరికా తయారీ అత్యున్నత వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయి: ట్రంప్
- భారత ఇంధన అవసరాలకు అమెరికా అండగా నిలుస్తుంది: ట్రంప్
- టెక్సాస్ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు భారత్‌కు అందుబాటులోకి వస్తాయి: ట్రంప్
- వచ్చే కొన్నేళ్లలో భారత్‌కు అమెరికా నుంచి ఎల్‌అండ్‌జీ ఎగుమతులు ప్రారంభం: ట్రంప్
23:08 September 22
నేను భారత్‌కు మంచి స్నేహితుడ్ని: ట్రంప్
- మోదీ ప్రభుత్వం 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చింది: ట్రంప్
- 40 కోట్ల మంది బలమైన మధ్యతరగతి ప్రజలు భారత్ ఆస్తి: ట్రంప్
- అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందాక వేగంగా ఉద్యోగాలు కల్పిస్తోంది: ట్రంప్
- అమెరికాలో నిరుద్యోగం 50 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది: ట్రంప్
- ఉద్యోగాల కల్పనలో కొద్దిరోజుల్లో కొత్తచరిత్ర సృష్టించబోతున్నాం: ట్రంప్
- అమెరికా సమాజంలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి: ట్రంప్
- నాలుగేళ్లలో కోటీ 40 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగింది: ట్రంప్
- పన్నుల హేతుబద్ధతతో కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది: ట్రంప్
- భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్నారు: ట్రంప్
- శాస్త్ర-సాంకేతిక, ఆర్థికరంగాల్లో వారి కృషి ప్రశంసనీయం: ట్రంప్
23:04 September 22
మోదీపై ట్రంప్ ప్రశంసలు...
- భారత్-అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూలేనంత బలోపేతం అయ్యాయి: ట్రంప్
- ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి: ట్రంప్
- రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇరుదేశాలనూ నూతన పథంలోకి నడిపిస్తున్నాయి: ట్రంప్
22:56 September 22
ట్రంప్ ప్రసంగం...
- మోదీ భారత్‌కు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేస్తున్నారు: ట్రంప్
- ఈ సభకు 50 వేలమంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం: ట్రంప్
- ఇది హృదయం ఉప్పొంగే రోజు: ట్రంప్
- అమెరికాలోని గొప్ప నగరాల్లో ఒకటైన హ్యూస్టన్ అందిస్తున్న ఆతిథ్యం మరవలేం: ట్రంప్
- ఈ సభను దిగ్విజయం చేసిన సెనేటర్లు అందరికీ ధన్యవాదాలు: ట్రంప్
- ఇక్కడి ప్రజాప్రతినిధులంతా హ్యూస్టన్ బలోపేతానికి యత్నిస్తున్నారు: ట్రంప్
- భారత్-అమెరికా స్వప్నాల సాకారానికి మోదీతో కలిసి పనిచేస్తాం: ట్రంప్
- భారత్ విలువలు, సంస్కృతి.. అమెరికా విలువలతో కలిసిపోతాయి: ట్రంప్
22:49 September 22
మోదీ ప్రసంగం...
- ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి మనతో ఉన్నారు: మోదీ
- ట్రంప్ పేరు తెలియనివారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు: మోదీ
- ప్రపంచంలోని ప్రతి 10 మంది సంభాషణలోట్రంప్ ఉంటారు: మోదీ
- వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో ఆయన చిరపరిచితులు: మోదీ
- ట్రంప్‌ను కలిసే అవకాశాలు తరచుగా నాకు లభించాయి: మోదీ
- ప్రతి సందర్భంలో అత్యంత స్నేహపూర్వకంగా ఆయన వ్యవహరిస్తారు: మోదీ
- అమెరికాను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ట్రంప్ నిరంతరం కృషి చేస్తున్నారు: మోదీ
- ఇప్పుడు ట్రంప్, మోదీ కాదు.. 2 అతిపెద్ద ప్రజాస్వామ్యాల సమాగమం ఇది: మోదీ
- హ్యూస్టన్ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుంది: మోదీ
- న్యూయార్క్ నుంచి బెంగళూరు, న్యూజెర్సీ నుంచి న్యూదిల్లీ వరకు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు: మోదీ
- లాస్‌ఏంజిల్స్ నుంచి లుధియానా వరకు టీవీలకు అతుక్కుపోయారు: మోదీ
- ఈ సభ కొత్త చరిత్రకు శ్రీకారం: మోదీ
- 2017లో మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు : మోదీ
- ఇవాళ నేను ఈ పెద్ద కుటుంబాన్ని మీకు ఇస్తున్నా: మోదీ
- వందకోట్ల మంది భారతీయుల మద్దతు ట్రంప్‌నకు అందిస్తున్నా: మోదీ
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మద్దతు ట్రంప్‌కు ఇస్తున్నా: మోదీ
22:27 September 22
ట్రంప్ రాక...
హోడీ మోదీ కార్యక్రమం జరుగుతోన్న ఎన్‌ఆర్‌జీ స్టేడియానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడే హాజరయ్యారు. ట్రంప్‌నకు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ స్వాగతం పలికారు.
21:59 September 22
నవీన భారతం ఆకర్షిస్తోంది...
- నవీన భారత ఆర్థిక వ్యవస్థ మమ్మల్ని ఆకర్షిస్తోంది: స్టెనీ హోయర్
- భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి కొత్త పాఠాలు నేర్పుతోంది: స్టెనీ హోయర్
- గాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ ముందుకెళ్తోంది: స్టెనీ హోయర్
21:53 September 22
స్టెనీ హోయర్ ప్రసంగం...
స్టెనీ హోయర్
- భారత్, అమెరికా ప్రజాస్వామ్యాలు అందరికీ మార్గదర్శకం: స్టెనీ హోయర్
- ఇరుదేశాల మధ్య మైత్రీబంధం బలోపేతం చేయడమే లక్ష్యం: స్టెనీ హోయర్
- 2016 నుంచి భారత్, అమెరికాకు అతిపెద్ద రక్షణ భాగస్వామి: స్టెనీ హోయర్
- శాస్త్ర, సాంకేతిక, వాణిజ్యంలోనూ ఇరుదేశాల మైత్రి కొత్త అడుగులు వేస్తుంది: స్టెనీ హోయర్
- ప్రభుత్వాల మధ్యే కాదు, ప్రజల మధ్య మైత్రీని బలోపేతం చేస్తాం: స్టెనీ హోయర్
- భారత్ అమెరికాకు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు: స్టెనీ హోయర్
21:49 September 22
జ్ఞాపిక అందజేత...
- హ్యూస్టన్‌లోని 'హౌడీ మోదీ' సభకు హాజరైన ప్రధాని మోదీ
- కరతాళ ధ్వనులతో స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
- ప్రధాని మోదీకి జ్ఞాపిక బహూకరించిన హ్యూస్టన్ మేయర్
21:41 September 22
మోదీకి ఘన స్వాగతం...
ప్రధాని నరేంద్ర మోదీకి.. అమెరికా చట్టసభ్యులు, స్టేడియంలో ఉన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ సభ మొత్తానికి తల వంచి అభివాదం చేశారు. స్టేడియం మొత్తం మోదీ నామస్మరణతో మార్మోగిపోతోంది.
21:38 September 22
టెక్సాస్ సెనేటర్...
మోదీ పర్యటనకు హ్యూస్టన్‌ను ఎందుకు ఎంచుకున్నారని ఆశ్చర్యపోయారు: సెనేటర్ జాన్ కార్నిన్
న్యూయార్క్ లేదా సిలికాన్ ఉంటుందని అందరూ ఊహించారు: జాన్ కార్నిన్
హ్యూస్టన్ ఎంతో కాలం నుంచి నిలిపివేసిన పెట్రోలియం ఉత్పత్తులకు అమెరికా దిగుమతికి అంగీకరించింది: కార్నిన్
టెక్సాస్ నుంచి సహజవాయువును భారత్ దిగుమతి చేసుకుంటోంది: కార్నిన్
21:33 September 22
స్వాగతం పలకనున్న చట్టసభ్యులు...
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొందరు అమెరికా చట్టసభ్యులు స్వాగతం పలకనున్నారు.
21:26 September 22
స్టేడింయకు చేరుకున్న మోదీ...
'హౌడీ మోదీ' కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌ఆర్‌జీ స్టేడియంకు చేరుకున్నారు. కాసేపట్లో ట్రంప్ హాజరుకానున్నారు.
21:02 September 22
అమెరికా గడ్డపై భారత్ నృత్యాలు
హౌడీ మోదీ కార్యక్రమంలో భారత సంస్కృతులకు పెద్ద పీట వేశారు. భారత్‌లోని వివిధ సంప్రదాయాలకు చిరునామా అయిన నృత్యాలను ప్రదర్శించి.. వీక్షకులను అలరిస్తున్నారు.
20:51 September 22
'నేనూ ఎదురుచూస్తున్నా'
హ్యూస్టన్‌కు బయలుదేరే ముందు ట్రంప్ చేసిన ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది నిజంగా ఓ గొప్ప రోజని.. ట్రంప్‌ను కలవడానికి ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు మోదీ.
హోడీ మోదీ కోసం ముస్తాబైన ఎన్‌ఆర్‌జీ స్టేడియం కిక్కిరిసిపోతోంది. భారత్- అమెరికా దేశాల సంప్రదాయాలతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో మోదీ-ట్రంప్ సభకు చేరుకోనున్నారు.
20:36 September 22
సర్వం సిద్ధం...
'హౌడీ మోదీ' వేడుకలో సందడి వాతావరణం నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న నృత్యాలు, పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరికొద్ది సేపట్లో వేడుక ప్రాంగణానికి చేరుకోనున్నారు..
20:06 September 22
మంచి సమయం గడపబోతున్నాం...
హ్యూస్టన్ సభకు హాజరయ్యేముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
"మేము హ్యూస్టన్ సభకు వెళ్లబోతున్నాం. కిక్కిరిసిన స్టేడియంలో ప్రధాని మోదీతో కలసి మంచి సమయం గడపబోతున్నాం." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
19:59 September 22
టెక్సాస్ సెనేటర్ రాక...
'హోడీ మోదీ' కార్యక్రమం కోసం ఎన్‌ఆర్‌జీ స్టేడియంకు టెక్సాస్ సెనేటర్ జాన్ కార్నిన్ చేరుకున్నారు.
19:56 September 22
మోదీ నామస్మరణ...
స్టేడియంకు ప్రవాస భారతీయులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేడియం మొత్తం మోదీ నామస్మరణతో హోరెత్తిపోతోంది.
19:42 September 22
కాసేపట్లో 'హౌడీ మోదీ' సభ
- హ్యూస్టన్‌లో కాసేపట్లో హౌడీ-మోదీ సభ
- ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సందడి
- మోదీ వేషధారణతో సందడి చేస్తోన్న అభిమానులు
- ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
19:12 September 22
సందడే సందడి...
'హౌదీ మోదీ' సభ జరగనున్న ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఎటు చూసినా ప్రవాస భారతీయుల కోలాహలమే నెలకొంది. డప్పులు వాయిస్తూ ఉల్లాసంగా ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నారు.
19:08 September 22
హ్యూస్టన్ బయల్దేరిన ట్రంప్...
హౌడీ మోదీ సభకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్ బయల్దేరారు.
18:49 September 22
'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?
భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి హౌడీ మోదీ వేదికను పంచుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్ బయల్దేరారు. ఈ ర్యాలీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. బిలియనీర్ వ్యాపారి... టెలివిజన్ స్టార్ అయిన అమెరికా అధ్యక్షుడు ఈ వేదికపై భారత్‌తో విదేశాంగ విధానాలపై ఏదైనా ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు.
టెక్సాస్ పట్టు చిక్కేనా...
2016లో టెక్సాస్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అదే టెక్సాస్‌లో ఈ సభ విజయవంతమవడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. మిషిగన్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ విజయం దక్కేలా చూశారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1988 నుంచి రిపబ్లికన్లకు ఇదే మొదటి విజయం. అయితే ఇవి తిరిగి డెమొక్రాట్ల చేతిలోకి వెళ్లిపోయాయి.
2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లదే పైచేయిగా మారింది. ఇప్పుడు 2020 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో ట్రంప్‌కు ప్రతి ఓటు అవసరం. టెక్సాస్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ డెమొక్రాట్స్ వైపు గాలీ వీస్తోంది.
ప్రస్తుతం ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో గాలప్స్ వీక్లీ సర్వేలో 50% మార్క్‌ను అందుకోని ఏకైక అధ్యక్షుడు ట్రంప్. అమెరికన్లు ట్రంప్ పనితనాన్ని ఏ విధంగా గమనిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రస్తుతం ట్రంప్ రేటింగ్ 44.3% ఉంది. అయితే ఇది ఒబామా రెండోసారి ఎన్నికైనప్పుడు (2011 సెప్టెంబర్) కంటే ఎక్కువే. ఇది రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారానికి బలమిచ్చే అంశమే.
ట్రంప్.. ఒబామాకు తేడా...?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పటివరకు భారత్‌లో అడుగుపెట్టలేదు. బరాక్ ఒబామా మాత్రం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు సార్లు దిల్లీ వచ్చారు. 2015 భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే హ్యూస్టన్ నగరంలో 50,000కు పైగా ప్రవాస భారతీయుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఆషామాషీ విషయం కాదు. భారతీయుల్లో మోదీ గాలి బలంగా వీస్తున్న ఈ తరుణంలో అమెరికాలోని ప్రవాసులకు దగ్గరవడం ట్రంప్‌కు కలిసొచ్చే విషయం. ఎందుకంటే రికార్డు స్థాయి మెజారిటీతో మోదీ రెండోసారి ఎన్నికయ్యారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ మానవహక్కుల పరిస్థితిపై అమెరికా చట్టసభ్యులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మోదీతో ట్రంప్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రవాసుల ప్రభావం...
భారతదేశం నుంచి అక్రమ వలసదారులను బహిష్కరించడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించే ప్రవాసులు సంప్రదాయకంగా డెమొక్రాట్లకు ఓటు వేస్తున్నారు. హెచ్1బీ వీసాలు, వలస నిబంధనల సమీక్షపై ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలతో వీరంతా అయోమయంలో ఉన్నారు.
అమెరికన్ రాజకీయాల్లో ప్రవాస భారతీయుల ప్రభావం గణనీయంగానే ఉంది. అమెరికా జనాభాలో దాదాపు ఒక శాతం వరకు ఉన్న మైనారిటీ ఆసియా సమాజంలో భారతీయులే అధికులు.
ట్రంప్ 24 మందికిపైగా భారతీయ-అమెరికన్లను తన ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. అయితే ఒబామా తన అధ్యక్ష పదవిలో ఎనిమిది సంవత్సరాల కాలంలో 50 మంది భారతీయ-అమెరికన్లను బాధ్యతాయుతమైన పదవుల్లో నియమించారు.
"విభిన్న రంగాలలో ప్రవాస భారతీయులు సాధించిన విజయాలు, వివిధ రంగాలలో అమెరికాకు వారు అందించిన సహకారం, భారతదేశంతో వారికున్న బలమైన బంధాలు, భారత్, అమెరికా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వంతెనగా వారు పోషిస్తోన్న పాత్ర మాకు గర్వకారణం.
అమెరికా అధ్యక్షుడు, నేను కలసి ప్రవాస భారతీయులతో అవుతున్న మొదటి భేటీ ఇది. ఇది ఓ సరికొత్త మైలురాయి.”
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
మోదీ, ట్రంప్‌లో పోలికలు...
ప్రపంచంలోని శక్తిమంతమైన పురాతన ప్రజాస్వామ్య దేశాలకు చెందిన ఈ ఇద్దరు అధినేతల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. ట్రంప్, మోదీ ఇద్దరూ ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా అత్యున్నత పదవిని అలంకరించారు. రాజకీయ వారసత్వం ఉన్న ప్రత్యర్థులపై గెలిచారు.
ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇరువురూ సామాజిక మధ్యమాలను విశేషంగా ఉపయోగించారు. ఇద్దరూ మీడియాతో వ్యవహరించే విధానాల్లోనూ పోలికలు ఉన్నాయి. మోదీ ఇప్పటికీ విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటారు.
అసత్య, తప్పుడు వార్తలు వ్యాప్తిని అరికట్టేందుకు ట్రంప్ మీడియాతో కఠినంగా వ్యవహరిస్తారు. అలానే వారి నినాదాల్లోనూ పోలికలు ఉన్నాయి. మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇస్తే... ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనేది ట్రంప్ మాట.
మోదీ- ట్రంప్ బంధం...
ట్రంప్ చాలా మంది అగ్రశ్రేణి ప్రపంచ నాయకులతో ఇబ్బందికరంగా కరచాలనం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మోదీ విషయానికి వచ్చేసరికి ట్రంప్ వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. కరచాలనం, హత్తుకునే విధానంలో అభిమానం తొణికిసలాడుతుంది.
ఈ మధ్య జీ-7 సదస్సులో భాగంగా ఇరువురు అగ్రనేతలు ఒకరిపై ఒకరు విసురుకున్న చమత్కార బాణాలే ఇందుకు నిదర్శనం.
ట్రంప్ ముందున్న అడ్డంకులు...
ఉద్యోగ కల్పన, చైనాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించడం, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ... ఇవన్నీ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన పెద్ద వాగ్దానాలు. అయితే వీటిని సాధించడానికి, వాణిజ్య అంతరాలను తగ్గించడానికి , దక్షిణాసియాలో స్థిరమైన వాతావరణం నెలకొనడానికి భారత్ పోషించాల్సిన పాత్ర ముఖ్యమైనది. అఫ్గాన్ తాలిబన్లతో శాంతి ఒప్పందం చర్చలు ప్రస్తుతం పట్టాలు తప్పిన ఈ సందర్భంలో భారత్‌తో స్నేహం ట్రంప్‌కు కీలకం.
సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో మోదీతో జరగబోయే అధికారిక ద్వైపాక్షిక చర్చలకు హ్యూస్టన్లోనే ఓ మంచి వాతావరణం నెలకొల్పనున్నారు ట్రంప్. అప్పుడు ఆ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య విభేదాలు తొలిగే అవకాశం దొరుకుతుంది.
“మేమిద్దరం త్వరలో చాలా పెద్ద ప్రకటనలు చేయబోతున్నామని నేను భావిస్తున్నాను. చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం. వాణిజ్య పరంగా, తయారీ పరంగా మేము భారతదేశంతో కలిసి పనిచేస్తున్నాము. ” - ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఒసాకాలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ విధంగా ప్రకటించారు.
మోదీ, ట్రంప్ పాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిస్తారా? జీఎస్పీ (అత్యంత ప్రాధాన్య హోదాను) తిరిగి పొందడానికి భారత్ ప్రయత్నిస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది.
ప్రస్తుతం భారత్, అమెరికా ఈ సభను తీక్షణంగా గమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. హౌడీ మోదీ సభలో ఏం ప్రకటనలు వెలువడతాయోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.