తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త అధ్యక్షుడొచ్చాడు సరే! కానీ భారత్​కేంటి?

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్​-అమెరికా బంధం చాలా బలంగా ఉంది. మరి రాబోయే అధ్యక్షుడు జో బైడెన్​ హయంలో ఎలా ఉండబోతుంది? బైడెన్​.. భారత్​తో ఎలా వ్యవహరిస్తారు. ఆర్టికల్​ 370ని వ్యతిరేకించిన కమలా హారిస్​తో భారత్​కు ఇబ్బందులు తప్పవా?

Joe Biden
కాబోయే అమెరికా అధ్యక్షుడు బైడెన్​తో భారత్​కు ఏంటి?

By

Published : Nov 8, 2020, 5:30 AM IST

అమెరికాకు కొత్త అధ్యక్షుడొచ్చాడు సరే! కానీ భారత్​కు ఏంటి? భారత్​తో సంబంధాలపై బైడెన్​ ప్రభావం ఎలా ఉండబోతోందనేది కీలకాంశం! ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్​ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. మరి బైడెన్​ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం! భారత కోణంలోంచి చూసినప్పుడు... విదేశాంగ విధానాల్లో జోబైడెన్​కు భారత్​గానీ.. భారత్​కు బైడెన్​గానీ కొత్తేమీ కాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో అమెరికాలో పర్యటించినప్పుడు బైడెన్​ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు! ఇద్దరికీ ఇప్పటికే పరిచయం ఉంది.

  1. భారత్​తో అమెరికా అనుంబంధ గతంలో మాదిరిగా కాకుండా వ్యవస్థీకృతమైంది. దాన్ని బలహీనపర్చటం అంత సులభం కాదిప్పుడు. చాలా అంశాల్లో భారత్​ అండ లేకుండా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించడం అమెరికాకు వీలు కాదు. పైగా.. బైడెన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో భారత అమెరికన్లకు దగ్గరయ్యారు. భారత్​తో స్నేహబంధాలకు బైడెన్ ప్రభుత్వం పెద్దపీటే వేయాల్సిన పరిస్థితి ఉందని బైడెన్​ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించటం గమనార్హం.
  2. అయితే భారత్​ విషయంలో అధ్యక్షుడు బైడెన్​తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ కూడా చాలా కీలకం! ఎందుకంటే బైడెన్ ఈ నాలుగేళ్లు మాత్రమే (వయసు కారణంగా) పదవిలో ఉంటానన్నారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కమలా హారిసే కాబట్టి.. చాలా అంశాల్లో ఆమె ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
  3. భారత్​తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు బహుశా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లే కొనసాగుతాయి. వాణిజ్య బంధం కూడా దాదాపు అలాగే ఉండొచ్చు. భారత విదేశాంగ నీతిలో అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ వ్యూహంపై బైడెన్ వర్గం ఇంకా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయలేదు. దాని కోసం వేచిచూడాలి.
  4. చైనాతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో ఎలా ఉంటాయనేది భారత్​కు కీలకం. ట్రంప్​లాగా చైనాతో ప్రతిదానికి గిల్లికజ్జాలు పెట్టుకోకపోవచ్చు. చైనా విషయంలో మెత్తగా వెళ్లినా కూడా బైడెన్​కు కష్టమే. అంతర్జాతీయంగా పెద్దన్న పాత్రను తిరిగి పోషించాలనుకుంటున్న అమెరికా కచ్చితంగా చైనాతో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్​ సాయం అవసరం అవుతుంది.
  5. హెచ్​-1బి వీసాల విషయంలో హామీలిచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఉదారంగా ఉంటారనుకోవడం అత్యేశే అవుతుంది.
  6. మానవహక్కుల ఉల్లంఘన మాత్రం రెండు దేశాల మధ్య కాసింత ఘర్షణాత్మక అంశం అయ్యే అవకాశాలున్నాయి. జమ్ముకశ్మీర్​లో 370 అధికరణ రద్దును డెమొక్రాట్లు ముఖ్యంగా కమలా హారిస్​ వ్యతిరేకించారు. ఈ విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వానికి కాసింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details