పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం. ప్రైవేటు వాణిజ్యం గురించి ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేనప్పుడు.. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు చిదంబరం.
ప్రైవేట్ వాణిజ్యం ఇప్పటికీ కొనసాగుతోందని.. ఆ ధర రైతుకు చెల్లించే ఎంఎంస్పీ కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు చిదంబరం. కనీస మద్దతు ధర అంత అద్భుతంగా నిర్ధారించగలిగితే.. ఇంతవరకు మంత్రి ఎందుకు ఆ పని చేయలేదు? అని ప్రశ్నించారు.
"ఏ రైతూ తన ఉత్పత్తులను ఎవరికి విక్రయించాడో?, దేశవ్యాప్తంగా ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయో ఆయనకెలా తెలుస్తుంది?. ఇలాంటి వివరాలేవీ లేకుండా ఎంఎస్పీ గురించి రైతులకు ఎలా హామీ ఇస్తారు?"
- చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత