తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2020, 4:32 PM IST

ETV Bharat / bharat

'సైన్యంలో వృత్తి నైపుణ్యత'ను మెరుగుపరచడం ఎలా?

సైనికుడు.. ఎండనకా, వాననకా దేశ రక్షణ కోసం సరిహద్దులో ప్రతి నిమిషం గస్తీ కాస్తాడు. అంతేకాదు అవసరమైతే తన ప్రాణాలు అడ్డేసి.. జన్మభూమిని కాపాడే ధీరుడు. అందుకే సైన్యం ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే ఇటీవల జనరల్ బిపిన్​ రావత్​ చేసిన వ్యాఖ్యలను టార్గెట్​ చేస్తూ.. సైన్యంలోనూ రాజకీయ ప్రభావం ఉందని పలువురు నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చెక్​ పెట్టి.. సైన్యంలో వృత్తి నైపుణ్యతను మరింత మెరుగుపరచడమెలా? సైనిక నిర్ణయాల్లో రాజకీయ నేతల సూచనలు ఎంత వరకు విలువైనవి.. తెలుసుకుందాం.

'సైన్యంలో వృత్తి నైపుణ్యత'ను మెరుగుపరచడం ఎలా?
How to maximises professionalism in army by kept politics aside

"భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాం. సైన్యంలో అధికారుల నుంచి జవాన్ల వరకు అందరం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేశాం. అన్నివేళలా అదే మాకు మార్గనిర్దేశం చేస్తుంది. రాజ్యాంగం ముందుమాటలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను కాపాడేందుకే మేము పోరాడుతున్నాం.".. 'ఆర్మీ డే' సందర్భంగా సైన్యాధ్యక్షుడు జనరల్ నరవాణే చేసిన వ్యాఖ్యలివి.

ప్రతి సైనికుడు దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే పూనుకున్నారని నరవాణే నొక్కి చెప్పినప్పటికీ.. ఆయన మాటల వెనక అంతరార్థం వేరే ఉంది. సైన్యంలో రాజకీయ ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఇటీవలే కొన్ని వర్గాల నుంచి ఆరోపణలు పుట్టుకొచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నరవాణే పైవిధంగా స్పందించి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఇటీవల పౌరసత్వ చట్టంపై సీడీఎస్ జనరల్​​ బిపిన్​ రావత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ​

'దేశ రక్షణే ప్రథమం'

సైనిక నీతిశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలలో 'దేశ రక్షణే ప్రథమం​' అన్నది ఒకటి. అదేవిధంగా దేశ మనుగడ, శ్రేయస్సు కోసమే సైన్యం ఉంది. ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకత్వం ద్వారా ఆ దేశ సంకల్పం వ్యక్తమవుతుంది. అందుకే వారి అభిప్రాయాలకు కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి.

అయితే సైన్యంలో రాజకీయ ప్రభావం లేకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది వృత్తి నైపుణ్యం. పౌర-సైనిక సంబంధాలను చాలా మంది పండితులు సైనిక వృత్తికి నేరుగా అనుసంధానిస్తారు. సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచడం ద్వారా వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే వృత్తి నైపుణ్యత ఉన్న సైనిక విభాగం పౌర నియంత్రణను వెంటనే అంగీకరిస్తుంది. ఏదేమైనా ప్రజాస్వామ్య దేశంలో ఇదొక శుభపరిణామమని చెప్పొచ్చు.

'అధిర్'​ వ్యాఖ్యలు సమంజసం కాదు

ఇక్కడ మరో విషయాన్ని కచ్చితంగా చెప్పాలి. అదేంటంటే.. సైన్యం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా.. సాధారణ వ్యూహాత్మక, కార్యాచరణ నిర్ణయాల్లోనూ రాజకీయ నాయకులు మిలిటరీకి దూరంగా ఉన్నప్పుడే సైన్యం వృత్తి నైపుణ్యత సాధిస్తుంది. అలాగే రాజకీయ నాయకులందరూ తమ చర్చల నుంచి సైన్యాన్ని దూరంగా ఉంచితే అది జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అదే విధంగా 'తక్కువ మాట్లాడండి ఎక్కువ పని చేయండి' అంటూ సైన్యాధ్యక్షుడిపై కాంగ్రెస్​ నేత అధిర్ రంజన్​ చౌదరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమైనవి. సైనిక ప్రమాణానికి కట్టుబడి ఉండేలా జవాన్లను పౌరులు అనుమతిస్తే.. దేశభద్రత దానంతట అదే పటిష్ఠం అవుతుంది.

మిలిటరీ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటైన దేశసేవలో.. దేశం ఏర్పడిన ప్రధాన సూత్రాలకు సైన్యం ప్రాధాన్యత ఇవ్వాలి. అదే వారి రాజ్యాంగం. మిలిటరీపై పౌర నియంత్రణ అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి విధేయత అని కొందరు వాదిస్తారు. కొన్ని కోణాల్లో ఈ వాదనలు ఆమోదయోగ్యంగా ఉండొచ్చు. కానీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ నాయకత్వ హక్కును అంగీకరించడం విధేయత అనిపించుకోదు. వృత్తి నైపుణ్యమే అవుతుంది. విధేయత అనేది ఎల్లప్పుడూ కారణం, విలువలకే ఉండాలి. అంతేగానీ నేతల వ్యక్తిగత, రాజకీయల భావజాలాలకు కాదు.

ప్రతిరోజూ రక్తం చిందిస్తున్నారు

నియంత్రణ రేఖ వెంబడి జరిగే కాల్పులతో సైనికులు దాదాపు ప్రతిరోజూ రక్తం చిందిస్తున్నారు. ఒకవేళ కాల్పులేమీ జరగలేదనుకుంటే.. కార్గిల్​, సియాచిన్​ వంటి ప్రదేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పోరాడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారిని స్థిరంగా ఉంచేది ఏంటో తెలుసా? జవాన్లందరూ తమ ప్రాణాల కన్నా దేశ సేవే ఎక్కువని భావించడమే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. సైనికుల్లో ఈ భావన మారదు.

40 ఏళ్లు సైన్యంలో పనిచేసిన నేను... నరవాణే వ్యాఖ్యలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇటీవలి కాలంలో సీనియర్​ మిలిటరీ అధికారులు చేసిన వ్యాఖ్యలు కొంత బాధ కలిగించినప్పటికీ.. నూతన సైన్యాధ్యక్షుడు వీటికి చెక్​ పెట్టే దిశగా చర్చలు జరుపుతారనే నమ్మకముంది. దేశంలోని అత్యుత్తమ సంస్థలలో సైన్యం ఒకటి. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్నిసార్లు మన నుంచి మనమే రక్షించుకోవాలి.

- (రచయిత : డీఎస్​ హుడా, రిటైర్డ్​ లెఫ్టినెంట్ జనరల్​)

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details