కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించటం ఎంతో ముఖ్యం. అదే సమయంలో వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ వేరొకరికి అంటుకునే ప్రమాదం ఉన్నందున మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్‌ను అడ్డుకునేందుకు ఎన్95 మాస్కులు చాలా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్లో మాస్కులు దొరికే పరిస్థితులు లేవు. ఎన్95 మాస్కులను పేదలు కొనుగోలు చేయలేని స్థితి. ఈ తరుణంలో సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎంతో మేలు. మరి మాస్కు తయారు చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం.
కావాల్సిన సామగ్రి
- మాస్కు తయారీకి సరిపడా 9x6 అంగుళాల ఆకారంలో రెండు కాటన్ వస్త్రాలు
- 2x16 అంగుళాలు సైజులో నాలుగు వస్త్రాలు
- స్కేలు
- కుట్టు యంత్రం లేదా సూది, దారం
- పెన్సిల్ లేదా మార్కర్
- కత్తెర
- కుట్టు పిన్నులు
- ఐరన్ బాక్స్
మాస్క్ తయారీ విధానం
1. రెండు వస్త్రాలను 9x6 అంగుళాల సైజులో దీర్ఘచతురస్రాకారంలో కత్తెరించాలి. రెండింటిని ఒకదానిపై ఒకటి ఉంచాలి.
దీర్ఘచతురస్రాకారంలో కత్తెరించాలి 2. 9 అంగుళాల వైపు పైభాగం మధ్యలో 2 అంగుళాల ఖాళీ వదులుతూ పిన్ లేదా మార్కు చేయాలి. మార్క్ చేసిన భాగాన్ని వదిలి ఇరువైపులా సూదితో కుట్టాలి. మాస్కును లోపల వైపునకు తిప్పేందుకు ఈ ఖాళీ ఉపయోగపడుతుంది.
పైభాగంలో 2 అంగుళాలు ఖాళీ వదిలి కుట్టాలి 3. తర్వాత మిగిలిన మూడు వైపులా సూదితో కుట్టాలి.
4. మాస్కు లోపలి వైపును 2 అంగుళాలు ఖాళీ వదిలిన భాగం నుంచి బయటకు తీయాలి. ఐరన్ బాక్స్‌తో మాస్కును ముడతలు లేకుండా చేయాలి.
ముడతలు లేకుండా ఐరన్ చేసుకోవాలి 5. మాస్కుకు 6 అంగుళాల వైపు స్కేలును నిలువుగా ఉంచాలి. 1.5 అంగుళాల లైన్ వద్ద ప్రారంభించి మడత రావాలనుకుంటున్న చోట పిన్ చేయాలి. ఇదే విధంగా 2, 3, 3.5, 4.5, 5 అంగుళాల వద్ద పిన్ చేసుకోవాలి. ఈ మడతలు మాస్కు సాగేందుకు ఉపయోగపడతాయి.
మడత రావాలనుకుంటున్న చోట పిన్ చేయాలి 6. 1.5 అంగుళాల పిన్ను 2 అంగుళాల పిన్ వద్దకు తీసుకొచ్చి కుట్టాలి. అలాగే మిగతా పిన్నుల స్థానాలను చేయాలి. ఇదే విధంగా 6 అంగుళాలు మరోవైపు పిన్ చేస్తూ మడతలు వచ్చేలా కుట్టాలి.
7. మడతల పైనుంచి సూదితో కుట్టాలి. ఇలా చేయటం ద్వారా మడతలు సమానంగా వస్తాయి.
మాస్క్ టై తయారీ విధానం..
1. 2x16 అంగుళాల సైజులో నాలుగు స్ట్రిప్స్‌ను కత్తెరించుకోవాలి.
నాలుగు భాగాలుగా స్ట్రిప్స్‌ను కత్తిరించుకోవాలి 2. ఒక్కోదానిని సమానంగా మధ్యలోకి మలుచుకోవాలి.
స్ట్రిప్స్ మధ్యలోకి సమానం మలుచుకోవాలి 3. మరోమారు మలుచుకొని 1/4 అంగుళాల సైజులోకి తీసుకురావాలి.
1/4 అంగుళాల సైజులోకి తీసుకురావాలి 4. వాటిని ఐరన్ చేసిన తర్వాత పొడవుగా కుట్టాలి.
స్ట్రిప్స్‌ను కుట్టి ఐరన్ చేసుకోవాలి 5. మాస్కు మూలలకు స్ట్రిప్స్ (టై)లను పిన్ చేసుకోవాలి.
నాలుగు మూలలకు స్ట్రిప్స్‌ను పెట్టి పిన్ చేసుకోవాలి 6. టైలను కలుపుతూ మాస్కును కుట్టుకోవాలి. దీని ద్వారా మాస్కు తయారీ పూర్తవుతుంది.
స్ట్రిప్స్‌ను కలుపుతూ కుట్టాలి మాస్క్ ధరించటం ఎలా?
- మాస్కులను సరైన పద్ధతిలో ధరిస్తేనే వాటివల్ల ఉపయోగం ఉంటుంది. మాస్కులు ఏ విధంగా ధరించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
- మాస్కును ధరించే ముందు 20 సెకన్లపాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
- ముక్కు, నోరును కప్పే విధంగా మాస్కును ధరించాలి.
- బయటకు వెళ్లిన సమయంలో మాస్కును ముట్టుకోకూడదు. అలా చేయటం ద్వారా అది కలుషితమవుతుంది.
- జన సంచారం ఉన్న చోట మాస్కును తీయకూడదు.
- ఇంటికి తిరిగి వచ్చిన సమయంలోనే దానిని తీయాలి. మాస్కు ముందుభాగాన్ని ముట్టుకోకుండా టైల ద్వారానే తీయాలి.
- మాస్కును తీసిన వెంటనే శుభ్రం చేయాలి.
- ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ మాస్కులు ప్రభావవంతమేనా?
సర్జికల్ మాస్కులతో పోలిస్తే సొంతంగా తయారు చేసుకున్న మాస్కులు కాస్త తక్కువ ప్రభావాన్ని చూపుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఎన్95 మాస్కులకు ఇవి ప్రత్యామ్నాయం కాదు. కానీ.. వైరస్ కణాలను అడ్డుకునేందుకు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లినప్పుడు ఏమీ లేకపోవడం కన్నా ఇవి చాలా మేలన్నది వారి మాట. కానీ.. మాస్కులు సామాజిక దూరం ద్వారా కలిగే ఫలితాన్ని కలిగించలేవని.. కనీసం 6 అడుగుల దూరం పాటించాలని సూచిస్తున్నారు.
మాస్కులను శుభ్రం చేయటం ఎలా?
మాస్కులను వినియోగించే ముందు, తర్వాత తప్పని సరిగా శుభ్రం చేయాలి. చేతులతో లేదా వాషింగ్ మిషన్ ద్వారా ఉతకాలి. వేడి నీటిలో ఉతికితే మరీ మంచిది.
ఇదీ చూడండి: ఇంట్లో చేసిన మాస్కులు కరోనా నుంచి రక్షిస్తాయా?