తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ... అలా చేస్తేనే చైనా దూకుడుకు కళ్లెం'

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకునేందుకు ప్రారంభించిన వీడియో సిరీస్​లో మూడో వీడియో విడుదల చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. చైనాతో వ్యవహరించాల్సిన విధానంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

rahul
'చైనాతో భారత్ వ్యవహరించాల్సిన విధానం ఇదే'

By

Published : Jul 23, 2020, 12:30 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో వ్యవహరించాల్సిన విధానంపై మూడో వీడియోను విడుదల చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. డ్రాగన్​తో వ్యవహారంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో దృష్టి నిలపాలని పేర్కొన్నారు.

విదేశీ వ్యవహారాల అంశమై మన ఆలోచనా ధోరణులు మార్చుకోవాల్సిన అవసరం ఉందని, రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలను పక్కనపెట్టి సమస్యలను పరిష్కరించాలని సూచించారు రాహుల్.

ఈ నెల 17, 20 తేదీల్లో చైనాతో వివాదం సహా దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రెండు వీడియోలను విడుదల చేశారు రాహుల్.

'ఇప్పటికీ చైనా ఆక్రమణలోనే'

భారత భూభాగాన్ని ఇప్పటికీ చైనా ఆక్రమించే ఉందని వెల్లడించారు రాహుల్. తనను బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకోవడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల్లో విజయం సాధించారని పేర్కొన్నారు రాహుల్. అయితే ఇలా బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకోవడమే ప్రస్తుతం భారత్​కు సమస్యగా పరిణమించిందని విమర్శించారు.

ఇవీ చూడండి:'కేంద్రం అసమర్థత వల్లే చైనా దూకుడు'

'లాక్​డౌన్​ చాలదు- టెస్టులు పెంచితేనే ఫలితం'​

ABOUT THE AUTHOR

...view details