తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ చట్టాల రద్దుకు ఇంకెంతమంది త్యాగాలు చేయాలి?' - కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. చట్టాలను రద్దు చేసేందుకు ఇంకెంతమంది రైతులు ప్రాణాలర్పించాలని ప్రశ్నిస్తూ ట్వీట్​ చేశారు. గత 17 రోజుల్లో 11మంది రైతులు మరణించారన్న వార్త కథనాన్ని ఆ ట్వీట్​కు జోడించారు.

How many sacrifices will farmers have to make to get agri laws repealed, asks Rahul
'ఆ చట్టాల రద్దుకు ఇంకెందరు రైతులు త్యాగాలు చేయాలి?'

By

Published : Dec 12, 2020, 2:16 PM IST

దిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై మరోమారు విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. చట్టాలను రద్దు చేయాలంటే ఇంకెంత మంది రైతులు ప్రాణ త్యాగం చేయాలని ప్రశ్నించారు. ఇందుకోసం.. గత 17రోజుల్లో 11మంది రైతులు మరణించారన్న వార్తా కథనాన్ని తన ట్వీట్​కు జోడించారు.

"సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన 17వ రోజుకు చేరింది. ఇప్పటివరకు 11మంది అన్నదాతలు అమరులయ్యారు. ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాల్ని పణంగా పెట్టాలి?"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.​

'అయినా.. ప్రభుత్వం పశ్చాత్తాపడట్లేదు'

రైతులు చేపట్టిన ఆందోళనలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారని... అయినప్పటికీ మోదీ ప్రభుత్వం పశ్చాత్తాపం చెందడంలేదని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా విమర్శించారు.

సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పంజాబ్​, హరియాణా రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ విషయమై కేంద్రం, రైతుల మధ్య ఇప్పటివరకు ఐదు దఫాల చర్చలు జరిగాయి. కానీ, రైతు యూనియన్​ల డిమాండ్​లను కేంద్రం అంగీకరించకపోవడం వల్ల.. ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

ఇదీ చదవండి:రైతుల నిరసనలతో మూతపడ్డ టోల్​ప్లాజాలు

ABOUT THE AUTHOR

...view details