తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హాయిగా నిద్రపోండి.. కలల్ని దూరం చేసుకోకండి' - కరోనాతో కలలపైనా ప్రభావం

కరోనా మహమ్మరి విజృంభణతో మానవాళి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది ఎక్కువ సేపు నిద్రపోతూ.. ఎక్కువ కలలు కంటున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కొవిడ్ కారణంగా వారి కలల్లోనూ మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

corona impact on Dreams
కలలపైనా కరోనా ప్రభావం

By

Published : May 3, 2020, 7:44 AM IST

కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన ప్రజల నిద్ర, కలల్లోనూ మార్పులు వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు. కొంతమంది ఒకింత ఎక్కువగా నిద్రపోతూ అధిక సమయం కలలు కంటున్నారట!

ఆందోళనతో ఉన్నవారికి మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. నిద్రలో కనుపాప అటూఇటూ కదిలే (ఆర్‌ఈఎం) వేళ ఇలా మెలకువ వస్తే.. ఆ సమయంలో నడుస్తున్న కల గుర్తుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందట.

మనం ఎక్కువ ఆందోళనతో ఉంటే మనకు వచ్చే కలలు కూడా ఎక్కువ స్పష్టంగా ఉంటాయి. రాబోయే కష్టాల్ని ఎదుర్కోవడానికి మనల్ని కలలు సిద్ధం చేస్తాయి. మన కలల గురించి ఇతరులతో మాట్లాడుకోవడం ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది. సహానుభూతి పెరుగుతుంది.. ఇవన్నీ కలలపై ఉన్న వివిధ విశ్లేషణలు. మొత్తంగా పరిశోధకులు చెబుతున్నదేమిటంటే హాయిగా నిద్రపోండి.. కలల్ని దూరం చేసుకోకండి.. అవి మన ఆవేశాల్ని, జ్ఞాపకాల్ని క్రమపద్ధతిలో నడిపే రాత్రిపూట చికిత్సలు.

ఇదీ చూడండి:కరోనా యోధులకు నేడు త్రివిధ దళాల గౌరవ వందనం

ABOUT THE AUTHOR

...view details