తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆకుపచ్చ కోడిగుడ్డు.. అదరగొట్టేసే డిమాండు

కేరళ మలప్పురంలోని కోళ్లు ఆకుపచ్చ సొనతో కోడి గుడ్లు పెడుతున్నాయి. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజం. ఇప్పుడు వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉంది. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?

How about green yolks in eggs?
ఆకు పచ్చ గుడ్డు సొన మీరెప్పుడైనా చూశారా?

By

Published : May 19, 2020, 6:47 AM IST

Updated : May 19, 2020, 7:41 AM IST

ఆకుపచ్చ సొనతో కోడిగుడ్డు.. అదరగొట్టేసే డిమాండు

మీరెప్పుడైనా గుడ్డు సొన ఆకుపచ్చగా ఉండడం చూశారా? ఎప్పుడూ చూడలేదంటారా? ఇదేదో ఇంద్రజాలం అనుకుంటున్నారా? కానే కాదు. ఇది అక్షరాలా నిజం.

కేరళ మలప్పురంలోని ఒతుంగల్ వెంగర గ్రామంలో షిహాబుద్దీన్ అనే పౌల్ట్రీ యజమాని ఉన్నాడు. ఆయన పౌల్ట్రీలోని కొన్ని కోళ్లు పెట్టే గుడ్లలో సొన ఆకుపచ్చ రంగులో ఉంటోంది. సాధారణంగా గుడ్డు సొన పసుపు రంగులో ఉంటుంది కదా. అందుకే మొదట్లో పచ్చ రంగు సొన చూసి కంగారు పడ్డాడు షిహాబుద్దీన్.

"మొదట్లో ఆకుపచ్చ సొన చూసి ఆందోళనకు గురయ్యాం. ఆ గుడ్లు తినొచ్చా లేదా? అనేది తెలియలేదు. కానీ వాటిని పొదుగు పెట్టిన తర్వాత, ఆరోగ్యవంతమైన కోడి పిల్లలు వచ్చాయి. అవి కూడా ఇప్పుడు పచ్చసొన గుడ్లనే పెడుతున్నాయి. మేము వాటినే తింటున్నాం."

- షిహాబుద్దీన్​, పౌల్ట్రీ యజమాని

సూపర్ క్రేజ్​

షిహాబుద్దీన్ దగ్గర చాలా రకాల కోళ్లు ఉన్నాయి. దేశవాళీ, కడక్​నాథ్, ఇంకా రకరకాల ఫ్యాన్సీ కోళ్లను చాలా ఏళ్లుగా పెంచుతున్నాడు. అయితే ఆకుపచ్చ సొన గుడ్లను గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం వల్ల వాటికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.

"ఈ పచ్చ సొన గుడ్ల గురించి ఆనాటా ఈనోటా ప్రపంచమంతా తెలిసిపోయింది. దీనితో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది" అని షిహాబుద్దీన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చూడండి:బండికి తానే ఓ కాడెద్దైన వలస కార్మికుడు

Last Updated : May 19, 2020, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details