కశ్మీర్ లోయలో దాదాపు 72 రోజుల విరామం తర్వాత మొబైల్ ఫోన్లు మోగడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ప్రజలకు ఎంతోసేపు నిలవలేదు. ఉగ్రవాదుల బీభత్సం నేపథ్యంలో కొద్దిసేవటికే ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు అధికారులు.
ఓ పాకిస్థాన్ జాతీయుడు సహా మరో ఉగ్రవాది కశ్మీర్లో అలజడి సృష్టించారు. పోస్ట్‌పెయిడ్ సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇద్దరు ఉగ్రవాదులు రాజస్థాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్‌ను దారుణంగా హత్య చేశారు. యాపిల్ తోటల యజమానిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్ సేవలను కేవలం పోస్ట్‌పెయిడ్ వాయిస్ కాల్స్‌కు మాత్రమే పరిమితం చేశారు.