తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోటళ్లు కళకళలాడాలంటే కొంతకాలం ఆగాల్సిందే! - Indian hotels and Restaurant survey 2020

లాక్​డౌన్​ కారణంగా మూతపడ్డ హోటళ్లు, రెస్టారెంట్​లు జూన్​ 8 నుంచి ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీలా పడ్డ వ్యాపార రంగాలు మళ్లీ పుంజుకోనున్నాయి. అయితే పూర్వవైభవం రావడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Hotels may have to wait 12-18 months to get back pre-Covid occupancy
హోటళ్లు కళకళలాడాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

By

Published : Jun 1, 2020, 6:17 AM IST

కరోనా విజృంభణతో అన్ని రంగాలు మూతపడ్డాయి. లాక్​డౌన్​ కారణంగా వ్యాపారస్థులు బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో జూన్​ 8 నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాపారాలు తిరిగి ప్రారంభించుకోవచ్చని అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు కొవిడ్​-19 కారణంగా మునుపటి స్థాయిని ప్రస్తుతం అందుకోవడం కష్టమేనని సర్వేలు చెబతున్నాయి. మళ్లీ వినియోగదారులతో కళకళలాడాలంటే 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని భావిస్తున్నాయి.

వ్యాపార రంగం.. జూన్​- ఆగస్టు త్రైమాసికంలో సుమారు 20 నుంచి 30 శాతం పుంజుకుంటాయన్న సర్వే.. 50 శాతం మేర బలపడటానికి 2021 జనవరి- మార్చి వరకూ వేచిచూడాలని పేర్కొంది.

హోటల్​ మేనేజర్ల సర్వే ఏమంటోందంటే..

హోటల్​ జనరల్​ మేనేజర్లు ఏప్రిల్​లో నిర్వహించిన మరో సర్వేలో.. నాల్గవ త్రైమాసికంలో 40 శాతం మేర మాత్రమే పుంజుకుంటాయని 46 శాతం మంది చెప్పారు. మరో 42 శాతం మంది మాత్రం వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనే 50 శాతం వరకు కళకళలాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

180 హోటళ్లపై..

సుమారు 180 హోటళ్లపై ఏప్రిల్​లో నిర్వహించిన ఈ సర్వేలో... 2019 ఏప్రిల్​ తో పోలిస్తే వ్యాపార రంగం 81 శాతం మేర పడిపోయిందని వెల్లడైంది. సింగపూర్​లో ఈ ప్రభావం 30 శాతం వరకు ఉండగా.. వైరస్​ ప్రారంభమైన నాటినుంచి చైనాలో 48 శాతం మేర క్షీణించింది.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో ఎక్కువ మంది బయటకు వచ్చింది ఇందుకే!

ABOUT THE AUTHOR

...view details