తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంపర్​ ఆఫర్​: రూ.1కే పరోటా, రూ.10కే బిర్యానీ - murali restarent

ఒక్క రూపాయికే పరోటా, పది రూపాయిలకే బిర్యానీ...! ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? తమిళనాడులోని ఓ రెస్టారెంట్​ యజమాని చేసి చూపించాడు. ఇంకేముంది.... వందల మంది హోటల్​ ముందు క్యూ కట్టారు.

బంపర్​ ఆఫర్​: రూ.1కే పరోటా, రూ.10కే బిర్యానీ

By

Published : Aug 4, 2019, 7:52 PM IST

బంపర్​ ఆఫర్​: రూ.1కే పరోటా, రూ.10కే బిర్యానీ
నూతన వస్త్ర దుకాణాలు ప్రారంభించినప్పుడు రూ.10కే చీర అనే ఆఫర్​ వినే ఉంటారు. అలాంటి ప్రకటనలను అందిపుచ్చుకున్నారు తమిళనాడు తేని జిల్లా పెరియకులమ్​ గ్రామంలోని మురలి రెస్టారెంట్​​ యజమాని. ఆదివారం హోటల్​ ప్రారంభోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు బంపర్​ ఆఫర్​ ప్రకటించారు. రూపాయికే పరోటా, పది రూపాయలకే బిర్యానీ అందించారు.

ఈ ఆఫర్​ తెలుసుకున్న జనాలు ఉదయాన్నే హోటల్​ ముందు బారులు తీరారు. వందల మంది రావటం వల్ల ట్రాఫిక్​ చిక్కులు ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్​ నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details